ఎన్టీఆర్‌..చిత్రంలో ఎన్టీఆర్‌ ఉండాలి.. బాలయ్య ఒప్పుకుంటాడా     2018-09-02   08:33:15  IST  Ramesh Palla

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్‌ మరియు బాలయ్య ఈ చిత్రాలను చేస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా కనిపించబోతున్నాడు. ఇక హరికృష్ణ పాత్రను నందమూరి కళ్యాణ్‌ రామ్‌తో చేయించబోతున్నారు. తాజాగా నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెల్సిందే.

Jr NTR In Biopic But Balakrishna Must Give The Permission-

Jr NTR In NTR Biopic But Balakrishna Must Give The Permission

ఆ సమయంలో నందమూరి ఫ్యామిలీ అంత ఏకతాటిపైకి వచ్చింది. నందమూరి కుటుంబలో గత కొన్ని రోజులుగా నెలకొన్న గొడవలు హరికృష్ణ మరణంతో సర్దుమణిగినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య చేస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించాలని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు. ఇన్ని రోజు బాలయ్యకు ఎన్టీఆర్‌కు మద్య విభేదాలు ఉన్నాయి కనుక ఆ చిత్రంలో బాలయ్య ఎన్టీఆర్‌కు ఛాన్స్‌ ఇవ్వలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మారి పోయింది.

బాబాయి, అబ్బాయిల మద్య విభేదాలు తొలగి పోవడంతో పాటు ఇద్దరి మద్య మంచి వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో నందమూరి అభిమానులు ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఈ విషయమై బాలకృష్ణ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఆమద్య ఎన్టీఆర్‌ చిత్రం నుండి పిలుపు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చిన జూనియర్‌ ఇప్పుడు బాలయ్య పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

Jr NTR In Biopic But Balakrishna Must Give The Permission-

ఎన్టీఆర్‌ చిత్రంలో హరికృష్ణ పాత్రను జూనియర్‌తో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పటికే కళ్యాణ్‌ రామ్‌ను ఆ పాత్రకు తీసుకోవడం జరిగింది. దానికి తోడు ఎన్టీఆర్‌ వద్ద అంతటి డేట్లు ఖాళీ లేవు. అందుకే చిన్న పాత్రకు ఎన్టీఆర్‌కు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బాలయ్య ఈ విషయంలో కాస్త పట్టు విడుపు చూపిస్తే ‘ఎన్టీఆర్‌’ చిత్రం స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ అభిమాను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.