'అలా చూపించి ఆడియన్స్ ను మోసం చేయలేము...' అరవింద సమేత విడుదలకు ముందు ఎన్టీఆర్ సంచలన కామెంట్స్.!   Jr NTR Comments On Aravinda Sametha Trailer     2018-10-09   08:17:55  IST  Sainath G

ప్రస్తుతం సినీ అభిమానుల చూపు మొత్తం “అరవింద సమేత” సినిమా పైనే ఉన్నాయి. ఈ వారం విడుదలవుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది…త్రివిక్రమ్,తారక్, జ‌గ‌ప‌తిబాబు కాంబినేషన్ లో వస్తున్న తొలిచిత్రం కావడం, తమన్ బాణీలు అందించడం ఇలా ఎన్నో విశేషాలున్నాయి. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ చిత్రబృందం బాగానే చేస్తుంది.

తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ట్రైలర్‌లో ఉన్నట్లే సినిమా ఆసక్తికరంగా ఉంటుందా?’ అనే ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందించారు. సినిమాలో లేని అంశాలను ట్రైలర్‌లో చూపించి ప్రేక్షకులను మోసం చేయలేమని చెప్పారు. సోషల్ మీడియా ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో.. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న సినిమాలను నేడు ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లను ఇప్పుడు మనం మోసం చేయలేం

85 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగు చలన చిత్ర సీమలో ఎన్నో కథలు వచ్చాయని, అసలు కథలు చెప్పగలిగేది తెలుగువాళ్లే అని తారక్ వెల్లడించారు. అయితే కాలక్రమేనా తెలుగు సినిమాలో మార్పులు వచ్చాయని, కథనాలతో సినిమాలు నడిచాయని అన్నారు. ఇప్పుడు మళ్లీ మనం కథలు చెప్పడం మొదలుపెట్టామన్నారు.