రోడ్డుపైనే భర్తను అరెస్ట్ చేశారు... ప్రసవవేధనతో స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పటల్ కి వెళ్లిన నిండు గర్భిణి..అసలేం జరిగింది     2018-08-20   13:02:35  IST  Rajakumari K

వలసదారుల విషయంలో అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జాతి విద్వేషాలు విరజిమ్ముతున్నాయి..తత్ఫలితంగా ఎన్నో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠిన నియమాలు,వాటి వలన అక్కడ సామాన్య జనం పడుతున్న కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం..ఆ నిర్ణయాల ఫలితం ఏ స్థాయికి చేరిందో చెప్పే హృదయవిధారక కథ ఇది..

Joal Arronna And Maria Venegas Are Getting Problem In America-

Joal Arronna And Maria Venegas Are Getting Problem In America

కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాండీనో నగరానికి చెందిన జోయెల్ అర్రోన్న,మారియా వెనెగస్ దంపతులు 12 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు. వీరికి నలుగురు సంతానం వున్నారు. వారికి అమెరికా పౌరసత్వమే వుండగా, ప్రస్తుతం వెనెగస్ నిండు గర్భవతి.ఈ క్రమంలో బుధవారం డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చారు. దీంతో దంపతులు ఇద్దరూ ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారులో పెట్రోల్ అయిపోయింది. ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా, అక్కడున్న అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు కారును చుట్టుముట్టేశారు.తమవద్ద వున్న అధికారిక పత్రాలు, డాక్యుమెంట్లను చూపించాల్సిందిగా వీరిద్దరిని కోరారు. మారియా తన డాక్యుమెంట్లను చూపించింది. జోయెల్ తొందరలో వాటిని ఇంట్లోనే మరిచిపోయాడు. దీంతో ఆమెను రోడ్డుపైనే వదిలేసి, అతని చేతులకు బేడీలు వేసి తమవెంట తీసుకెళ్లిపోయారు. అతని భార్య నిండు గర్భవతి అన్న విషయం కూడా మరిచిపోయి ఉన్మాదంగా ప్రవర్తించారు అక్కడి పోలీసులు. కొద్దిసేపు బాధపడి, తానే అతికష్టం మీద కారు నడుపుకుంటూ ఆసుపత్రికి వెళ్ళి సిజేరియన్ చేయించుకుంది మారియా. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Joal Arronna And Maria Venegas Are Getting Problem In America-

‘ఎలాంటి తప్పు చేయని నా భర్తను అమానుషంగా అరెస్ట్ చేశారు. మాఇంట్లో ఆయన ఒక్కరే సంపాదిస్తారు. ఇప్పుడు మేమెలా బతకాలి ? జోయెల్ ఎలాంటి తప్పు చేయలేదు. పోలీస్ అధికారులు కూడా ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా జోయెల్‌ను అరెస్ట్ చేశారు’ అని రోదిస్తుంది మారియా. భర్త అరెస్ట్ తో బిడ్డ పుట్టిన సంతోషం లేకుండా పోయింది ఆ తల్లికి…