రియల్ హీరో : కొండగట్టు తరహా బస్సుప్రమాదంలో 80మంది ప్రాణాలు కాపాడిన జెసిబి డ్రైవర్..   JCB Driver Kapil Saves 80 Buss Passengers In Tamil Nadu     2018-09-25   14:53:22  IST  Rajakumari K

ఇటీవల జరిగిన కొండగట్టు బస్సు ప్రమాదం గుర్తుంది కదూ.. 61 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనని ఎలా మర్చిపోగలం చెప్పండి..కళ్లముందే పెద్దలు,చిన్నపిల్లలు హాహాకారాలు చేస్తుంటే చూస్తూ కూడా ఏం చేయలేకపోయాం..అయ్యో ఆ కొండగట్టు అంజన్నే వారిని కాపాడుండాల్సిందే అని అనుకుని ఉండుంటాం..కానీ కేరళలో ఇంలాంటి తరహాలోనే జరిగిన ఘటనలో కపిల్ అనే జేసీబీ ఆపరేటర్ దేవుడిలా వచ్చి 80మంది ప్రాణాలనకు కాపాడాడు..ఇక్కడ అతడికి ఎలాంటి మాయలు మంత్రాలు తెలియవు..కేవలం తన సమయస్పూర్తే అతడి ఆయుధం..

తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు కేరళలోని రాజక్కాడ్‌కు వెళుతోంది. ఎరచ్చిపార వద్ద ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. బస్సు లోయలోకి పడబోతున్న తరుణంలో అక్కడే ఉన్న కపిల్ తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లాడు. కపిల్ జేసీబీ హ్యాండ్‌‌తో బస్సును దాదాపు గంటపాటు నిలిపి ఉంచాడు. దీంతో 80 మంది ప్రయాణికులు బస్సు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. తర్వాత ఎంతో శ్రమించి బస్సును కూడా బయటకు లాగేశారు.

JCB Driver Kapil Saves 80 Buss Passengers In Tamil Nadu-

80 మంది ప్రాణాలను కాపాడిన కపిల్‌ సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. కానీ అతడు మాత్రం తన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడటం లేదు.ఇటీవల కపిల్ స్నేహితుడు అతడి గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కపిల్ చొరవతో ప్రాణాలు దక్కించున్నవారు ఆనంద భాష్పాలు రాలుస్తూ అతడికి థ్యాంక్స్ చెప్పిన విషయాన్ని తన వాల్‌పై రాసుకొచ్చాడు. కపిల్ అలా చేయకపోతే.. మరుసటి రోజు పేపర్లలో విషాద వార్తను చూడాల్సి వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..