పవర్ కోసం పవన్ ఎత్తులు .. ఎన్నికల తరువాత కీలకం కాబోతున్నాడా  

పార్టీ పెట్టడమే కాకుండా అధికార పీఠం దక్కించుకునేందుకు సైలెంట్ వెపన్ లా దూసుకొస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాడో అనే సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి. జనసేన పవర్ కోసం కాదు ప్రశ్నించడానికే అంటూ ఆవేశ ప్రసంగాలు చేసిన పవన్ ఆ తరువాత కర్ణాటక లో జరిగిన ఎన్నికల పరిస్థితులను చూసి ప్రస్తుత అక్కడి సీఎం కుమారస్వామి కి దక్కిన ఛాన్స్ తనకూ వస్తుందనే ఆశలో ఉన్నాడు. సొంతంగా అధికారం దక్కించుకునే అవకాశం లేకపోతే ఆ విధంగానైనా చక్రం తిప్పే ఆలోచనలో పవన్ ఉన్నాడు.

Janasena Pawan Kalyan Will Main In 2019 Elections-

Janasena Pawan Kalyan Will Main In 2019 Elections

పార్టీ ప్రకటనకు ముందే పవన్ కళ్యాణ్ జరగబోయే అనేక పరిణామాలను ముందుగానే ఊహించాడు. అప్పటికే ప్రజారాజ్యం ఎఫెక్ట్ కూడా ఆయన మీద ఉంది. అందుకే, ఆవేశంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆచీతూచి ముందడుగు వేయడం ప్రారంభించాడు. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేవరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం.. ఇప్పుడు కలిసివస్తుందనే చెప్పుకోవాలి. అప్పుడు వ్యూహాత్మకంగా టీడీపీ – బీజేపీలకు మద్దతిచ్చిన పవన్.. పరోక్షంగానే తన బలం ఏమిటో పరీక్షించుకున్నాడు. టీడీపీకి ఇప్పుడు దూరంగా జరిగినా బీజేపీ విషయంలో మెతక వైఖరి కనబరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Janasena Pawan Kalyan Will Main In 2019 Elections-

మొదట్లో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసినా, ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనే భావం ఏర్పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన టీడీపీని ప్రధాన లక్ష్యం చేసుకుని సాగుతున్నాడు. చాపకింద నీరులా తమ కేడర్‌ను బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట్లో వైసీపీ కూడా ‘జనసేన’ను తక్కువ అంచనాయే వేసింది. అయితే, తాజాగా వైసీపీ అధినేత జగన్.. పవన్‌పై వ్యక్తిగత ఆరోపణలకు దిగడాన్ని పరిశీలిస్తే.. పవన్ బలం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, టీడీపీ నేతలు కూడా వీలు దొరికినప్పుడల్లా పవన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక పవన్ సొంతంగా ఎన్నికల బరిలోకి వెళ్లి టీడీపీ , వైసీపీ లకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నాడు. సొంతంగా అధికారం చేపట్టే ఛాన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఏ పార్టీ అధికారం దక్కించుకోవాలన్న తానే కీలకం అవుతానని పవన్ గ్రహించేసాడు.