మూడు పెళ్లిళ్లు ఇక అధికారం పక్కా.. పవన్ ఫ్యాన్స్ కొత్త నిర్వచనం  

అభిమానం వెర్రి తలలు వేయడం అంటే ఏంటో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని చూస్తే యిట్టె అర్ధం అయిపోతుంది. ఒక హీరో మీద , ఒక నాయకుడి మీద అభిమానం ఉండవచ్చు కానీ మరీ దురభిమానంగా అది మారకూడదు. ఇంతకీ విషయం ఏంటి అంటే రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఏపీలో రెపరెపలాడించడంతో పాటు అధికారం ఖచ్చితంగా చేజిక్కించుకుంటుంది అని పవన్ ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ చెప్పేస్తున్నారు. దీనికి వారు చూపిస్తున్న కారణం కూడా చాలా కామెడీ గా ఉంది.

Janasena Pawan Kalyan Fans About Three Marriages-

Janasena Pawan Kalyan Fans About Three Marriages

పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గెలుపు , పక్కనున్న తమిళనాడులో కరుణ మరణం తో వెల్లువెత్తిన సానుభూతి చూసి పవన్ ఫ్యాన్స్ కి కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చిందట. అటు ఇమ్రాన్, ఇటు కరుణ మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారే. ప్రస్తుతం ప్రజలు అలాంటి విషయాల గురించి పట్టించుకోకపోబట్టే ఇమ్రాన్ విజయం సాధించారని , కరుణ దీర్ఘకాలంగా రాజకీయ ప్రస్థానం చేయగలిగారు అని వాళ్ళు అనుకుంటున్నారట. ఆ ఫ్లో చూసి పవన్ కూడా సీఎం అవుతాడని గట్టిగా నమ్ముతున్నారంట.

Janasena Pawan Kalyan Fans About Three Marriages-

ఒకవేళ జనసేన ఏపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఆ సెంటిమెంట్ బలపడిపోతుంది. ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ వ్యక్తి ఆరాధన రాజకీయాల్లో కొనసాగినంత కాలం ఇంతే .ప్రజలు ఆ బలహీనత దాటి విధానాల పరంగా పాలకుల్ని ఎన్నుకునే రోజులు వచ్చేదాకా ఇలాంటి నమ్మకాలు , చిత్రవిచిత్రాలు చూడకతప్పదు. ఒక్క ఈ సెంటిమెంట్ ను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళిపోతామంటే కుదరదు కదా. ప్రస్తుతం పవన్ తన సొంత జిల్లా అయినా పశ్చిమగోదావరిలో పర్యటిస్తున్నారు. భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ సభలకు భారీగా జనాలు కూడా వస్తున్నారు. అయితే ఇదంతా చూసి అధికారం మాదే అని ప్రకటనలు గుప్పిస్తే సరిపోదు కదా ! దానికి తగిన కసరత్తు చేస్తే కానీ ప్రయోజనం ఉండదు.