జగన్ మాటలకు క్లారిటీ దొరకడంలేదా ..? మార్పు కావాలా ..?     2018-08-19   12:11:50  IST  Sai Mallula

ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా ! అందులో మార్పు తీసుకొస్తా ! ఇందులో మార్పు తీసుకొస్తా ! అంటూ జగన్ మార్పు గురించి పడే పడే చెప్పుకొస్తున్నాడు అయితే జగన్ తీసుకొస్తాను అంటున్న మార్పు ఎలా తీసుకొస్తాడో కాస్త వివరంగా చెబితే బాగుండుని కానీ అలా చెప్పడంలేదు . ఎక్కడికి వెళ్లినా మార్పు తీసుకొస్తా అని మాత్రమే పడే పడే చెప్తూ పోతున్నాడు. అసలు జగన్ మాట్లాడుతున్న మాట్లా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆ పార్టీ నాయకులు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. కానీ వారు ఇవేమి పట్టించుకోనట్టు కనిపిస్తున్నారు. అందుకే జగన్ రొటీన్ గా అవే డైలాగులు అవే హామీలు ఇస్తూ పాదయాత్రను బోర్ కొట్టించేస్తున్నాడు.

జగన్ కోరుకుంటున్న ఈ ‘మార్పు’ ఏంటనేది సామాన్యులకు అర్థం కావడం లేదు! ఇంకోటి. ఆ మార్పు జగన్‌ ఒక్కడివల్లే సాధ్యం కాదంటారు, జనం రావాలంటారు! జనానికి అర్థమయ్యేట్టు చెప్పలేని ఆ మార్పు కోసం. జగన్ వెంట జనాలు రావాలంటే ఎలా వస్తారు..? రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ రావాలంటారు. కానీ, తాను వాటిని ఎలా తెస్తానో, ప్రాక్టికల్ గా వాటిని తెచ్చేందుకు తానేం చెయ్యబోతున్నాననేది కూడా జగన్ చెప్పడం లేదు. మార్పు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత ఇలాంటి పదాలు ఎన్నైనా మాట్లాడొచ్చు కానీ, వాటిని పాలనలోకి ఎలా తెస్తారనే వివరణ, విజన్ ప్రజలకు కావాలి. జగన్ పాదయాత్ర 239 రోజులు దాటినా. వాటిపై ఇంకా స్పష్టత ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు.

Jagan Have No Clarity About Political Speeches-

Jagan Have No Clarity About Political Speeches

నర్సీపట్నంలో జరిగిన పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ… ఇలాంటి దోపిడీ పాలన ఇంకా కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. మోసం, అవినీతి, అబద్ధాలతో కూడిన చంద్రబాబు పాలనను ఇన్నాళ్లూ చూశారన్నారు. ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించాలని జగన్ కోరారు. ఏ నాయకుడైనా ఫలానా పని చేస్తానని చెప్పి, చెయ్యలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలన్నారు. అలాంటి మార్పు రావాలంటే జగన్ ఒక్కడి వల్లే సాధ్యం కాదనీ, ప్రజలందరి ఆశీస్సులూ ఉండాలని జగన్ కోరారు. అంటే, జగన్ కోరుకునే మార్పేంటి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేనివారు, వెంటనే రాజీనామా చేసి ఇంటికెళ్లిపోవాలట!

ఒక పార్టీ అధికారంలో ఐదేళ్లు ఉంటుంది కదా! ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి.. ఆపార్టీకి చివరిరోజు వరకూ అవకాశం ఉంటుంది. ఈలోపే, హామీలు అమలు చెయ్యలేదని రాజీనామా చేయాలని ఎలా చెప్తున్నాడు. జగన్ కోరుకుంటున్న మార్పును ప్రాక్టికల్ కోణం నుంచి చూస్తుంటే హామీలు అమలు చెయ్యడానికి ఐదేళ్లు టైమున్నప్పుడు, మధ్యలో రాజీనామా చేసి వెళ్లిపోయే తరహా పరిస్థితి ఎలా సాధ్యమౌతుందనేది అర్థం కావడం లేదు. జగన్ ఇకనైనా తన ప్రసంగాల్లో మార్పులు చేసుకుని మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయం అందరిలోనూ ఇప్పుడు వ్యక్తం అవుతోంది.