ఆ విషయంలో జగన్ యూటర్న్ తీసుకుంటాడా ....  

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే మనస్తత్వంతో ఉంటాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. తాను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే ఉంటాడు. దాని పర్యవసానంగా ఎన్ని వడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కుంటాడే తప్ప వెనకడుగు మాత్రం వేయడు. అయితే ఆ పంథాలో వెళ్లడం వల్లే గత ఎన్నికల్లో అధికారం దక్కినట్టే దక్కి దూరం అయ్యింది. అయితే ఇప్పటి వరకు కూడా జగన్ ఆ పంథానే కొనసాగిస్తూ వస్తున్నాడు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ తన రూటు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునుపటిలా మంకుపట్టు పడితే అధికారం దూరం అవుతుందనే విషయాన్ని జగన్ కూడా గ్రహించాడు.

Is YS Jagan Voice Will Be In Ap Assembly-

Is YS Jagan Voice Will Be In Ap Assembly

అధికార పార్టీ అవినీతి వ్యవహారాలను ఇక ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కాకుండా … ప్రజల దృష్టిలో పలచన అవ్వకూడదంటే ఇప్పుడు తప్పనిసరిగా తన నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి జగన్ కి వచ్చింది.చంద్రబాబు ఎప్పుడూ విలువలు పాటించడమే లేదంటూ జగన్ తరుచూ చెప్తుంటాడు. పార్టీ ఫిరాయించిన నేతల విషయంలో పూర్తిగా విలువలకు పాతరేశాడు. చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రతిపక్షం వాయిస్‌ని అస్సలు పట్టించుకోలేదు. అందుకే అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని జగన్ నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టిడిపికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.

Is YS Jagan Voice Will Be In Ap Assembly-

అందుకే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జగన్ మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అలాగే అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రసంగాలు వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చేవి. చంద్రబాబుతో సహా అందరినీ కూడా జగన్ కార్నర్ చేసిన వైనం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మెప్పించింది. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో చివరి సమావేశాల్లో అయినా వైసీపీ సభ్యులతో పాటు జగన్ కూడా పాల్గొని ప్రభుత్వ పనితీరును ఎండగడితే ఆ పార్టీకి పొలిటికల్ మైలేజ్ పెరగడం గ్యారంటీ. జగన్ కూడా సమావేశాలకు హాజరవుతేనే పార్టీకి కలిసొస్తుందని ఆలోచిస్తున్నాడు.