'జగన్'...జెండా పీకేసే టైం వచ్చేసిందా..?   Is YS Jagan Party In Deep Trouble     2018-09-21   11:55:43  IST  Bhanu C

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జగన్ వైసీపీ గెలుపుకోసం వ్యుహాలని సిద్దం చేయాల్సింది పోయి తన పార్టీకి తానే తూట్లు పోడుచుకుంటున్నారు.అంతేకాదు జగన్ చేష్టల వలన త్వరలో జెండా పీకేస్తారేమో అనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రతీ నేతలు..పార్టీ పెట్టిన మొదట్లో జగన్ ఎలా ఉండేవాడో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి పార్టీని తీసుకు వెళ్తున్నాడు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కీలక నేతలు..ఇంతకీ జగన్ కి ఏమయ్యింది పార్టీ నేతల్లో ఇంతగా భయం కలగడానికి కారణం ఏమిటి…? అసలు జగన్ ఏమి చేస్తున్నారు అంటే.

ఎటువంటి పార్టీకైనా సరే మొదటినుంచీ జెండా మోసే వారికి పార్టీలో ఎంతో విలువ గుర్తింపు ఉంటాయి వారిని ఆ పార్టీ అధ్యక్షుడు గుర్తించాలి కూడా..అయితే జగన్ మాత్రం ఈ విషయంలో ఎంతో భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని నమ్ముకుని సేవ చేసి, ప్ర‌జ‌ల్లో తిరిగిన వారిని కాదనుకుని ఇప్పుడు ఒక్కసారిగా డబ్బులు లేవనే నెపం పెట్టుకుని లేక మరేదైనా కారణం చూపి అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం మార్చేస్తున్నాడు జగన్ ఈ పరిణామాల వలన పార్టీ బలహీన పడుతుందని నేతలు చెప్తున్నా పెడచెవిన పెడుతున్నాడట…

Is YS Jagan Party In Deep Trouble-

ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌..గుంటూరు..క‌ర్నూలు..జిల్లాల నేతలు జగన్ ఎఫెక్ట్ తో తల్లకిందులు అయ్యారట అయితే తాజాగా జగన్ ఇలాంటి ప్రయోగాలే మరొక చోట ప్రయోగించాడట..అది కూడా రాజకీయ చైత్యన్యం ఎక్కువగా ఉన్న ఉత్త‌రాంధ్ర‌లోనూ..ఎంతో అభివృద్ధి చెందుతున్న వైజాగ్ లోనూ చేస్తున్నాడట..పార్టీలో సమన్వయ కర్తలని ఎంతో సింపుల్ గా తీసేస్తున్నాడట..ఇప్పటికే ఎలమంచిలి, విశాఖ ఉత్తరం, దక్షిణం సమన్వయకర్తలను తొలగించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తవారిని నియమించే యోచనలో ఉన్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.