బాబు పై కేసీఆర్ ఈ రేంజ్ లో ప్లాన్ చేశాడా ..     2018-09-02   07:53:39  IST  Sai Mallula

తడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు ఉంటాడని సామెత ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తుకు తెస్తున్నాడు. తెలంగాణాలో ఉనికి కోల్పోయిందని భావిస్తున్న టీడీపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సహకారంతో బలం పెంచుకోవాలని చూస్తుండడంతో కేసీఆర్ దానికి చెక్ పెట్టాలని చూస్తున్నాడు. తెలంగాణ లో టీడీపీ కాంగ్రెస్ దోస్తీ టీఆర్ఎస్ కి నష్టం చేకూరుస్తుందని కేసీఆర్ కి బాగా తెలుసు. అందుకే టీడీపీ ని ముందుగా వీక్ చెయ్యాలని చూస్తున్నాడు.

Is KCR Planes Revange On Chandrababu Naidu-

Is KCR Planes Revange On Chandrababu Naidu

ప్రధానంగా తెలంగాణాలో బాబు సామాజిక వర్గం వారిని టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అందుకే ముందుగా … హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆశలు పెట్టుకున్న బాబు సామజిక వర్గం వారిని కేసీఆర్ చేరదీస్తున్నాడు. అంతే కాకుండా సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు పడకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్లాన్ వేస్తున్నాడు.

ఏపీ టీడీపీలోని నేతలతో కొంత సన్నిహిత సంబంధాలు పెట్టుకుని, వారికి కాంట్రాక్టులూ ఇవ్వడంతో పాటు అన్నివిధాలుగా నేనున్నాను అనే భరోసా వారిలో కల్పిస్తున్నాడు.

Is KCR Planes Revange On Chandrababu Naidu-

ఇలాంటి నేపథ్యంలో కమ్మ కమ్మ సామజిక వర్గం వారు కేసీఆర్ కు కొద్దీ కొద్దిగా దగ్గరవుతున్నారు. ఇక ఇప్పుడు నందమూరి హరికృష్ణ స్మారక నిర్మాణం అంటూ కేసీఆర్ ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ సానుభూతిపరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఎత్తుకు పై ఎత్తు వేసి టీడీపీ కి తెలంగాణ లో ఉనికే లేకుండా చేసేందుకు కేసీఆర్ పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడు