విడిపోయిన భార్యకు భరణంగా 7లక్షలు చిల్లర ఇచ్చిన భర్త..పగ ఇలా కూడా తీర్చుకుంటారా నోరెళ్లబెట్టిన జనం..     2018-08-25   10:09:20  IST  Rajakumari K

అన్యోన్యంగా ఉంటున్న భార్యభర్తల మధ్య బంధాన్ని వర్ణించాలంటే కొన్నిసార్లు మాటలు చాలవు.. అదే వారిమధ్య ఒక్కసారి భేదాలొచ్చాయంటే వారికంటే బద్ద శతృవులు ఇంకొకరు ఉండరు..సోషల్ మీడియాలో ,బయట భార్యభర్తలగురించి వచ్చే జోక్స్ మనం చూస్తూనే ఉంటాం..కేవలం బాదిత మహిళలే కాదు,భార్యా బాదితులం మేమున్నామంటూ కొందరూ వాపోతుంటారు..ఇతగాడు కూడా అలాంటి భార్యాబాదితుడే అనుకుంటా.. కలిసి ఉన్నప్పుడు భార్యని ఏం చేయలేక విడిపోయాక తన పగని ఎలా తీర్చుకున్నాడంటే..ఆ పగ కూడా మనకు నవ్వుతెప్పించేలా…

Indonesian Man Pays Rs 7.3 Lakh Alimony To Ex-Wife… In Coins-

Indonesian Man Pays Rs 7.3 Lakh Alimony To Ex-Wife… In Coins

ఇండోనేసియాలోని కరంగన్యార్ పట్టణానికి చెందిన సుశీలార్తో తొమ్మిదేళ్ల కిందట విడిపోయిన భార్యకు భరణంగా రూ. 7 లక్షల మొత్తాన్ని మొత్తం చిల్లర రూపంలో ఇచ్చి కసి తీర్చుకున్నాడు. . ద్వీ సుశీలార్తో ప్రభుత్వోద్యోగి ఎప్పుడో భార్యకు విడాకులు ఇచ్చాడు. కోర్టు ఆదేశం ప్రకారం ఆమెకు ఇటీవల ఆమెకు భరణం ఇచ్చాడు..భరణం ఇవ్వడానికి కోర్టుకి వచ్చిన రోజున కొన్ని డబ్బు సంచులు తీసుకొచ్చాడు..ఆ సంచుల బరువు 890కేజిలైతే,అందులో ఉన్న డబ్బు మొత్తం 7లక్షల చిల్లర..సుశీలార్తో చేసిన పనికి కోర్టులో ఉన్న వారంతా నోరెళ్లబెట్టగా..తన మాజీభార్య మాత్రం ఈ చిల్లర వేషాలేంటంటూ కస్సుమంది. ఇది తన క్లయింటును ఘోరంగా అవమానించడమేనని, ఈ చిల్లరను లెక్కెట్టుకునే ప్రస్తకే లేదని ఆమె తరఫు లాయరు అన్నాడు.

Indonesian Man Pays Rs 7.3 Lakh Alimony To Ex-Wife… In Coins-

అయితే సుశీలార్తో న్యాయవాది ఆయన వాదనను తిప్పికొట్టాడు. డబ్బు ఏ రూపంలో ఉన్నా డబ్బేనని అన్నాడు.అయినా కోర్టు తీర్పులో చిల్లర ఇవ్వాలా,నోట్లు ఇవ్వాలా చెక్కు రూపేణా ఇవ్వాలా అనేది ఏది మెన్షన్ చేయలేదని..అలాంటప్పుడు ఎలా ఇస్తే ఏంటి, తన క్లయింటు జీతం తక్కువ అని, అతడు చుట్టాలను, మిత్రులను అడిగి ఈ డబ్బు సేకరించాడని వివరించాడు. దీంతో చేసేదేమీ లేక అప్పటివరకు కస్సుబుస్సు లాడిన మాజీ భార్య ఆ చిల్లర తీసుకోవడానికి ఒప్పేసుకుంది.కానీ ఆ చిల్లర లెక్కపెట్టలేక కోర్టు సిబ్బంది చేతులు పోయాయి.. భార్యగారికి ఆ చిల్లర మార్చుకోవడమే సరిపోతుందేమో..