కువైట్ లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్'...అరెస్ట్..!   Indian NRI Arrested For Illegal Medical Service At Kuwait     2018-10-08   14:50:49  IST  Sai M

దేశ విదేశాలలో ఉన్న భారతీయులు అందరూ ఎంతో మంచి ఉన్నత స్థితికి వెళ్లి ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటే కొంతమంది మాత్రం భారత్ పరువు తీయడానికి విదేశాలు వెళ్ళినట్లుగా ఉంటోంది..చేసే పని చాలకో అధిక డబ్బుల కోసం కక్కుర్తో ఏమో కాని కారణం ఏదైనా భారతీయుల పరువు మాత్రం విదేశాల సాక్షిగా తీసేస్తున్నారు..ఇంతకీ ఏమి జరిగిందంటే..

కువైట్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక భారతీయుడు కువైట్ లో మెడికల్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నాడు..దాంతో అతడిని అతడితో పాటు మరో నలుగురుని కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..భరత్ కి చెందిన అతగాడు కువైట్ లో ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా మెడికల్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు…అక్కడితో ఆగకుండా

శస్త్రచికిత్సలు, అబార్షన్లు కూడా ఒక నిపునిడిలా చేసేస్తున్నాడట ఓ వ్యక్తి లైసెన్స్ లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేయడంతోపాటు మందులు కూడా దొంగిలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా దుకారణంలో తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గవర్నమెంట్ హెల్త్ సెంటర్ల నుంచి మెడిసిన్‌ను దొంగిలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలో తగిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.