లవర్ తో కలిసి సినిమాకి వెళ్ళింది.. సీన్ రివర్స్ అయ్యింది.. వెనక సీట్ లో తండ్రి ఉండే సరికి.     2018-08-28   11:33:01  IST  Sai Mallula

ఈ మధ్య కాలంలో యువత హద్దులు మీరుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు అనుకుంట. పెద్దల మాట లెక్కచేయకుండా చదువుకోమని కాలేజీ కి పంపిస్తే లవర్స్ తో కలిసి చక్కర్లు కొడుతున్నారు. అలాగే ఒక యువతి తల్లితండ్రులు కళ్ళు కప్పి బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళింది. తల్లితండ్రులేమో మా అమ్మాయి కాలేజ్ లో చదువుకుంటోంది అనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా బాయ్ ఫ్రెండ్ తో థియేటర్ లో కూతురు కనిపించేసరికి ఆ తండ్రి షాక్. తండ్రికి ఒళ్ళు మండి చితకబాదాడు. ఈ ఘటన వరంగల్ లోజరిగింది.

Indian Lovers Caught In S2 Movie Hall By Her Father-

Indian Lovers Caught In S2 Movie Hall By Her Father

వివరాలలోకి వెళ్తే.. ఫెస్టివల్ మూడ్.. పైగా సండే.. కావడంతో ప్రేమికులిద్దరు సరదాగా s2 సినిమా హాల్ కు వచ్చారు. టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్లారు. ఏదో చేద్దామనుకున్నారు కానీ పెద్ద ట్విస్ట్ ఎదురయ్యి సీన్ రివర్స్ అయ్యింది. యువతి తండ్రి అదే సినిమా హాల్లో వెనకాలే కూర్చున్నాడు. అయితే కొద్ది సేపటి తరువాత ముందు కూర్చున్న యువతి తన కూతురేనని గుర్తించాడు.

Indian Lovers Caught In S2 Movie Hall By Her Father-

అంతే తన కూతురు ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందన్న కోపాన్ని తండ్రి తట్టుకోలేక పోయాడు. వెంటనే కూతురిని బయటవరకు ఈడ్చుకుంటూ వచ్చి తీవ్రంగా కొట్టాడు. చదువుకోమని పంపిస్తే లవర్ తో కలిసి సినిమాకు వస్తావా అంటూ కూతురును చావబాదాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చితక్కొట్టాడు.