జపాన్ దేశంలో ఉద్యోగం ఇవ్వాలంటే బ్లడ్ గ్రూప్ అడుగుతారట..బ్లడ్ గ్రూప్ ని బట్టి వ్యక్తిత్వ అంచనా..మీరూ చెక్ చేసుకోండి.

సాధారణంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను వారి నడవడికను బట్టీ చెబుతుంటారు.మనదేశంలో అయితే కొందరు జాతకాల ద్వారా, చేతి రేఖల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుపుతుంటారు.

 In Japan Your Blood Type Could Get You Hiredor Fired-TeluguStop.com

కానీ జపాన్లో అయితే బ్లడ్ గ్రూప్ ని బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పేస్తారట.అంతేకాదు ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే ముందుగా బ్లడ్ గ్రూప్ అడుగుతారట.

జపాన్ లో సుమారు 60 సంవత్సరాల క్రితమే ఇలా బ్లడ్ గ్రూప్ ల ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేశారట.మీ రక్తం గ్రూప్ ను బట్టీ మీ పర్సనాలిటీని అంచానా వేయొచ్చనేది వందశాతం నిజం.

ఇందులో ఎలాంటి డౌట్ లేదు.కావాలంటే ఇక్కడ ఇచ్చిన విషయాలు మొత్తం చదివి ఆ బ్లడ్ గ్రూప్ వారు అలా ప్రవర్తిస్తున్నారో లేదో కూడా చెక్ చేయండి.

A గ్రూప్ (A +,A-)

ఈ బ్లడ్ గ్రూప్ మనుషులు సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.వీరికి కలుపుకునే పోయే ఎక్కువగా ఉంటుంది.ఇతరులకు సహకరించే గుణం వీరికి ఉంటుంది.వీరు బాగా సెన్సిటివ్ వ్యక్తులు.బాగా తెలివైన వారు.ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే ఉంటుంది.

నాయకత్వ లక్షణాలు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువే.అయితే వీరు ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళన చెందే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం అంత త్వరగా తీసుకోలేరు.

మొత్తానికి A బ్లడ్ గ్రూప్ వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి అందరితో బాగా మెలిగే స్వభావం కలిగి ఉంటారు.

B గ్రూప్ (B+,B-)

వీరు తామే నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులుగా ఫీలైపోతుంటారు.

వీళ్లు ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు.వీరికి రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది.

అయితే క్లిష్ట పరిస్థితుల్లో వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు.

AB గ్రూప్ (AB+,AB-)

వీరు చాలా ఫ్యాషనబుల్ గా ఉంటారు.వీరు కాస్త ప్రత్యేకంగా కనిపించాలని పరితపిస్తుంటారు.వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది.

భక్తిభావం కలిగి ఉంటారు.వీరు చిన్నచిన్న సమస్యలకు అస్సలు కుంగిపోరు.

వీరు ప్రపంచ జనాభాలో కేవలం 2% -5% మాత్రమే ఉంటారు.AB బ్లడ్ గ్రూప్ నకు చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందరు.

Oగ్రూప్ (O+,O-)

వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది.వీరికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది.

అయితే కొన్ని విషయాల్లో తప్పని పరిస్థితుల్లో ఇతరులపై ఆధారపడతారు.ఒత్తిళ్లను, ఆందోళనను తట్టుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది.

వీరికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

ఎవరు ఎవరితో అనుకూలంగా ఉంటారు

అలాగే ఆయా బ్లడ్ గ్రూప్ లకు సంబంధించిన వారు మరో కొన్ని బ్లడ్ గ్రూప్ ల వారితో సన్నితంగా మెలుగుతారు.

A బ్లడ్ గ్రూప్ వారు A, AB బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు.B బ్లడ్ గ్రూప్ వారు B, AB బ్లడ్ గ్రూప్ లతో అనుకూలంగా ఉంటారు.

AB బ్లడ్ గ్రూప్ వారు AB, B, A, O బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు.O బ్లడ్ గ్రూప్ వారు O, AB బ్లడ్ గ్రూప్ ల వారితో ఎక్కువగా అనుకూలంగా ఉంటారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube