ఐకియా బిర్యానీలో గొంగళి పురుగు దర్శనం...సోషల్ మీడియా ద్వారా కంప్లైంట్ చేసిన బాదితుడు.. 11,500 జరిమానా!     2018-09-03   11:12:00  IST  Rajakumari K

కొత్తొక వింత పాతొక రోత అనే సామెతలు ఊరికనే రాలేదు. నెల రోజుల క్రితం హైటెక్‌సిటీ ప్రాంతంలో అట్టహాసంగా ప్రారంభమైంది ఐకియా స్టోర్.అప్పుడు నగర జనాభా అంతా అక్కడే ఉన్నారా అన్నట్టు తలపించాయి దృష్యాలు. అర్దరాత్రి పైగాకొన్న కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్,ఐకియా స్టోర్లో కూడా జనాల తోపులాట చూసిన వారికి ఇంతకాలం వీరు చాపల్లో పడుకుని కుండల్లో వండుకున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు కొందరు..గుండు పిన్ని దగ్గర నుండి ఫర్నీచర్ వరకు అక్కడ దొరకని వస్తువంటూ లేదు. ప్రఖ్యాత అంతర్జాతీయ ఐకియా స్టోర్‌లో చేదు అనుభవం ఎదురైంది.ఐకియాకు చెందిన ఫుడ్‌కోర్టులో శాఖాహార బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన తాజాగా కలకలం సృష్టించింది.

IKEA Hyderabad Store Caterpillar Found In Vegetable Biryani-

IKEA Hyderabad Store Caterpillar Found In Vegetable Biryani

అబీద్ అహ్మద్ అనే వ్యక్తి ఐకియా సందర్శించడానికి వెళ్లాడు.అక్కడి ఫుడ్‌కోర్టులో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు..అందంగా ముస్తాబు చేయబడిన ఫుడ్ అబీద్ టేబుల్ పైకి రెడీ అయి వచ్చింది.దాంతో ఐకియా సందర్శన విశేషాల్ని స్నేహితులతో పంచుకుంటూ ఆనందంగా వెజ్ బిర్యాని తింటుండగా, అందులో గొంగళిపురుగు దర్శనం ఇచ్చింది..దాంతో వెంటనే దాన్ని ఫోటో తీసి ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు మీడియా ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. సోషల్ మీడియా ద్వారా అబీద్ ఇచ్చిన ఫిర్యాదుని స్వీకరించిన జిహెచ్ఎంసీ అధికారులు సదరు ఫుడ్‌కోర్టులో తనిఖీలు నిర్వహించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా అక్కడ 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే వారు ఫుడ్‌కోర్టు మేనేజర్‌కు నోటీసులు జారీచేయడంతో పాటు రూ.11500 జరిమానా విధించారు. అలాగే, ఐకియాకు బిర్యానీ సరఫరా చేస్తున్న నాగపూర్‌కు చెందిన హల్దీరామ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేశారు.