హైదరాబాద్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్ లో బట్టబయలైన షాకింగ్ సంఘటన.. తాగకున్న తాగినట్టు! చివరికి.?     2018-08-27   05:46:43  IST  Sai Mallula

శనివారం రాత్రి సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురికి పోలీసులు జరిమానా విధించారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మద్యం సేవించని ఓ యువకుడికి 43 శాతం ఆల్కహాల్‌ సేవించినట్లు రీడింగ్‌ వచ్చింది. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. వివరాల లోకి వెళ్తే..!

ఆ యువకుడి పేరు సయ్యద్‌ జహిరూల్లా ఖాద్రి. 20 ఏళ్ల ఈ యువకుడు గత శనివారం రాత్రి రాంకోఠి మీదుగా తన ఇంటికి వెళ్తుండగా సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో భాగంగా అతన్ని ఆపి తనిఖీ చేశారు. అయితే జహిరుల్లా 43 శాతం మధ్యం సేవించినట్లుగా రీడింగ్‌ రావడంతో పోలీసులు అతని ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Hyderabad Police Failure Drunk And Drive Test Failure-

Hyderabad Police Failure Drunk And Drive Test Failure

తనకు అసలు మద్యం అలవాటే లేదని చెప్పిన పోలీసులు వినలేదు. వైద్యపరీక్షలు చేయించామన్న నిర్లక్షంగా వ్యవహరించి పట్టించుకోలేదు. దీంతో ఆవేదన గురైన జహిరుల్లా సుల్తాన్‌బజార్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులను ఆశ్రయించాడు. తనను అన్యాయంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు వెంటనే అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మెడికల్‌ రిపోర్ట్‌లో జహిరుల్లా మద్యం సేవించలేదని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. చివరికి ట్రాఫిక్‌ పోలీసులు తనను ఉద్దేశ్యపూర్వకంగా కేసులో ఇరికించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.