అతడు చనిపోయిన మూడేళ్లకు తండ్రి అయ్యాడు..ఇంతకీ తల్లి కావడానికి అతని భార్య ఏం చేసిందో తెలుసా..     2018-08-20   16:23:02  IST  Rajakumari K

ఇద్దరు భార్యభర్తలు సంతోషంగా దాంపత్య జీవితం గడుపుతుంటే..యాక్సిడెంట్ రూపంలో వచ్చిన మృత్యువు భర్తని భార్యకు దూరం చేసింది..దాంతో ఒంటరైన భార్య తన భర్త ప్రతిరూపాన్ని తిరిగి ఈ భూమ్మిదకు తీసుకురావాలని తపన పడి చివరికి విజయం సాధించింది..పండంటి బిడ్డను ఒడిలోకి తీసుకుని తన భర్తే తిరిగి వచ్చాడన్నంత సంబరపడింది..భర్త మరణించిన మూడేళ్లకు తాను తల్లి అయి,చనిపోయిన భర్తని తండ్రిని చేసింది..

3 Years After Man Died- His Son Is Born-

3 Years After Man Died- His Son Is Born

సుప్రియ జైన్ ఉద్యోగం కోసం చాలా ఏళ్ల క్రితమే జైపూర్ నుంచి బెంగళూరు వచ్చేసింది. ఆమెకు గౌరవ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. వివాహమై రెండేళ్లు కావొస్తున్న వారికి పిల్లలు కలగలేదు. దీంతో ఐవీఎఫ్‌ను ఆశ్రయించారు.ఐవిఎఫ్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కొద్దిరోజులకు యాక్సిడెంట్‌లో గౌరవ్ ప్రాణాలు కోల్పోయాడు.అప్పటివరకు సంతోషంగా సాగిన జీవితంలో భర్త మరణంతో సుప్రియ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది.కొన్ని నెలల తర్వాత మెల్లగా కోలుకున్న ఆమె భర్త వీర్యంతో గర్భం దాల్చాలని నిర్ణయం తీసుకుంది తెలిసిన వారి సలహాపై ముంబైలోని డాక్టర్ ఫిరుజా పరిఖ్‌ను కలిసింది. ఈ ప్రక్రియ ప్రారంభించే ముందే ఆమె మానసికంగా తనను తాను సన్నద్ధం చేసుకుంది. ఇక అంతా సిద్ధం అనుకున్నాక బెంగళూరు నుంచి గౌరవ్ వీర్యాన్ని తెప్పించారు. దాంతో సరిపడా అండాలను పొదిగించారు. కానీ ఐవీఎఫ్ ప్రక్రియ ఫలించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా సరగోసీని ఆశ్రయించారు. వేరే మహిళ గర్భంలోకి గౌరవ్ వీర్యాన్ని ప్రవేశపెట్టారు.

3 Years After Man Died- His Son Is Born-

భర్త వర్ధంతి రోజున ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లడం సుప్రియకు అలవాటు.అలా ఈసారి ఆమె బాలిలో ఉండగా.. అబ్బాయి పుట్టాడని ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఫ్లైట్ ఎక్కిన ఆమె.. తన భర్తతో మూడేళ్ల క్రితం చివరిసారి మాట్లాడిన సమయానికి.. బిడ్డను ఒళ్లోకి తీసుకుని ఆనంద భాష్పాలు రాల్చింది.నాకు బిడ్డ కావాలని అనుకోలేదు. గౌరవ్ బిడ్డ ఈ భూమ్మీదకు రావాలనుకున్నా. మేం ఎప్పుడూ ఒకరికి జన్మనివ్వాలని, మరొకరిని దత్తత తీసుకోవాలని అనుకునే వాళ్లం. ఇక నుంచి గౌరవ్ వర్ధంతి రోజు నేనెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని సుప్రియ ఉద్వేగంగా చెప్పింది.