21 లక్షల పేర్లు ఓటర్ లిస్ట్ లో నుండి తొలగించారంట.? మీ పేరు ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో ఇలా తెలుసుకోండి!   How To Check Name In Voter List In Telangana     2018-09-26   11:56:53  IST  Sainath G

త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఓటర్ కార్డు లేని వారందరు కొత్తగా అప్లై చేసుకుంటున్నారు. అయితే ఓటర్ లిస్ట్ లో నుండి తాజాగా 21 లక్షల ఓటర్ల పేర్లు ఫేక్ అని లిస్ట్ లో నుండి తొలగించారంట. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి తమ పేరు ఓటర్ లిస్ట్ లో ఉందొ లేదో అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. అయితే ఆ డౌట్ ను క్లారిఫై చేసుకోవడం చాల ఈజీ అంటోంది తెలంగాణ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్.. అందుకోసం మనకు రెండు ఆప్షన్ల‌ను అందుబాటులో ఉంచింది. అందులో ఒకటి sms ద్వారా, రెండోది ఎన్నికల అధికారిక వెబ్సైట్ నుంచి మ‌న ఓటు వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. డీటెయిల్స్ మీరే చూడండి

1.sms ద్వారా ఎలా చేసుకోవాలంటే:

మీ ఫోన్ నుంచి TS VOTE VOTERID NO ఎంటర్ చేసి 9223166166 నెంబర్ కు లేదా 51969 కు sms చెయ్యాలి Example:- TS VOTE ABC1234567 ఇలా అన్నమాట. ఇలా చేసిన కొంతసేపటికి మీకు రిప్లై sms వస్తుంది. మీ పేరు.. నియోజకవర్గం ఓటర్ లిస్టులో ఉందొ లేదో అప్పుడు తెలుస్తోంది.

2.ఆన్లైన్ ద్వారా:

అంతేకాదు మనకున్న రెండో ఆప్షన్ మీ ఫోన్ లేదా కంప్యూటర్ లోని ఇంటర్నెట్ బ్రౌజర్ లో https://ceotelangana.nic.com/ or https://ceoandhra.nic.com/ ను ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత కేటగిరీలోని search yuour name లో –> Assembly Constituency ని క్లిక్ చెయ్యాలి.

అందులో జిల్లా పేరు, నియోజకవర్గం పేరును ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తరువాత మీ పేరుతో కానీ ఓటర్ఐడి కార్డును కాని ఎంటర్ చేయాలి. ఆ తరువాత కింద ఉన్న క్యాప్చ ను కరెక్ట్ గా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ రాని పక్షంలో మీ పేరు ఓటర్ లిస్టులో లేదని గుర్తించి వెంటనే నమోదు చేసుకోవాలి.