బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ఇంత క్రేజ్ సంపాదించుకున్న 'కౌశల్' కెరీర్ ఎలా ఉండబోతుంది.? హౌస్ నుండి వచ్చిన తర్వాత.!   How Is Kushal Career After Bigg Boss 2 Show     2018-09-11   11:30:39  IST  Sainath G

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు. మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది. కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి. ఇక కౌశల్ ఆర్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. ఇటీవలే కౌశల్ కి సపోర్ట్ గా 2 కె రన్ కూడా నిర్వహించారు హైదరాబాద్ లో.

మొత్తానికి బిగ్‌బాస్ షో మాత్రం అతనికి ఊహించని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. కౌశల్ బిగ్‌బాస్ సీజన్‌ 2కి సైన్ చేసినపుడు చివరి వరకూ ఉండి విన్నర్ అవ్వాలనే లక్ష్యంతోనే చేసి ఉంటాడు. షోలో కూడా అతని అడుగులు లక్ష్యం వైపే పడ్డాయి. ‘నేను బంధాలను పెట్టుకోవడానికి రాలేదు.. గేమ్ కోసం వచ్చాను’ అంటూ తన లక్ష్యాన్ని ఎన్నో సందర్భాల్లో హౌస్‌మేట్స్‌కి వెల్లడించాడు కూడా.

How Is Kushal Career After Bigg Boss 2 Show-

కౌశల్‌కి వచ్చిన ఫాలోయింగ్ అతనికి చాలా సినిమాల ఆఫర్లు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్ కౌశల్‌తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అతని కెరీర్ గ్రాఫ్ కంప్లీట్‌గా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకముందు వరకు చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు కౌశల్. కానీ ఇకపై ఫుల్ లెంత్ రోల్స్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న నాని కి కూడా ఇంత క్రేజ్ వచ్చిందో లేదో కానీ…కౌశల్ కి మాత్రం బాగా క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా లేదా పక్కన పెడితే..ఆడియన్స్ హృదయాలను ఇప్పటికే గెలిచేసిన కౌశల్ కి కచ్చితంగా సినిమా అవకాశాలు పెరుగుతాయి.