వెంకటేష్‌ మాత్రమే ప్రేక్షకులను అర్థం చేసుకుంటున్నాడు.. థ్యాంక్యూ వెంకీ మామ.  

తెలుగు ప్రేక్షకులు ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి వారు మల్టీస్టారర్‌ చిత్రాలు చేశారు. ఆ తర్వాత తరం చిరంజీవి, బాలయ్య, నాగార్జునలు మల్టీస్టారర్‌పై ఆసక్తి చూపించలేదు. వెంకటేష్‌ ఇతర హీరోలతో అప్పట్లో నటించేందుకు ముందుకు వచ్చినా కూడా వారు నో చెప్పడంతో మల్టీస్టారర్‌ చిత్రాలు పెద్దగా రాలేదు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వచ్చిన వాటిల్లో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

Hero Venkatesh Multi Starrer With Nagachaitanya-

Hero Venkatesh Multi Starrer With Hero Nagachaitanya

ఈతరం మల్టీస్టారర్‌ చిత్రాలకు ఆజ్యం పోసింది వెంకటేష్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్‌బాబుతో కలిసి వెంకటేష్‌ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్నాయి. తాజాగా వెంకటేష్‌ ఏకంగా నాలుగు మల్టీస్టారర్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాలున్న మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి నుండి బ్యాక్‌ టు బ్యాక్‌ రాబోతున్నాయి.

వెంకటేష్‌ ఇప్పటికే ‘ఎఫ్‌ 2’ అనే చిత్రంలో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆ తర్వాత అల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే చిత్రంను చేసేందుకు సిద్దం అయ్యాడు. బాబీ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందబోతుంది. ఇక సూర్యతో కలిసి వెంకటేష్‌ ఒక చిత్రం చేయబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. తాజాగా మరో చిత్రంకు కూడా వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

Hero Venkatesh Multi Starrer With Nagachaitanya-

మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ మరో హీరోగా వెంకటేష్‌ ఒక భారీ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో యుద్ద సన్నివేశాలు ఉంటాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సూర్యతో కలిసి చేసే ముందే దుల్కర్‌తో సినిమా చేయబోతున్నాడు. మొత్తానికి వెంకీ మామ వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలను ఒప్పుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రేక్షకులకు ఏం కావాలో అర్థం చేసుకుని అదే ఇచ్చేందుకు ప్రయత్నింస్తున్న వెంకీ మామకు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు.