వెంకటేష్‌ కూతురు లవ్‌ మ్యారేజ్‌కు రంగం సిద్దం.. పెద్దలు ఓకే చెప్పారా?   Hero Venkatesh Daughter Ashritha Love Marriage Will Be Soon     2018-09-22   12:15:47  IST  Ramesh P

విక్టరీ వెంకటేష్‌ కూతురు అశ్రిత త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. ఈ విషయం ప్రస్తుతం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వెంకటేష్‌కు పెళ్లి వయస్సు వచ్చిన కూతురు ఉందా అనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా మీడియాలో వచ్చిన వార్తలకు కొందరు షాక్‌ అవుతున్నారు. ఇక వెంకీ కూతురు అశ్రిత ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది. ఆమద్య అఖిల్‌తో వెంకీ పెద్ద కూతురు వివాహం జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను రెండు కుటుంబాల వారు కొట్టి పారేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్రిత వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ చైర్మన్‌ ఆర్‌ సురేందర్‌ రెడ్డి మనవడితో గత కొంత కాలంగా అశ్రిత ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. ఇటీవలే వీరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. ప్రేమ విషయం తెలిసిన వెంటనే సురేష్‌బాబు స్వయంగా వెళ్లి సురేందర్‌ రెడ్డి ఫ్యామిలీతో మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది. వెంకటేష్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌ 2’ చిత్రం షూటింగ్‌ నిమిత్తం వేరే దేశంలో ఉన్నాడు. ఆకారణంగానే సురేష్‌బాబు పెద్దరికంగా పెళ్లి మాట్లాడి వచ్చినట్లుగా తెలుస్తోంది.

దగ్గుబాటి వారితో చుట్టరికం కలుపుకునేందుకు, దగ్గుబాటి వారి అమ్మాయిని తమ ఇంటి కోడలుగా చేసుకునేందుకు సురేందర్‌ రెడ్డి వారి ఫ్యామిలీ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే వెంకీ సినిమా చిత్రీకరణ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియా రాబోతున్నాడు. ఇండియాకు వచ్చిన తర్వాత వివాహ నిశ్చితార్థం ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Hero Venkatesh Daughter Ashritha Love Marriage Will Be Soon-

వెంకటేష్‌ కూతురు బేకరి రంగంలో ప్రొఫెషనల్‌. ఈమె హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తన స్టాల్స్‌ను నిర్వహిస్తున్నారు. మరో వైపు ఆ కుర్రాడి గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన రఘురామిరెడ్డి తనయుడే వెంకీకి కాబోయే అల్లుడు అంటూ ప్రచారం జరుతుంది. ఇప్పటికే ముగ్గురు స్టార్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలు మామలు అయ్యారు. మిగిలి ఉన్న వెంకీ కూడా త్వరలోనే మామ కాబోతున్నాడు.