చిన్నకూతురు విషయంలో రాజశేఖర్‌ సంచలన నిర్ణయం     2018-08-18   10:14:06  IST  Ramesh Palla

యాంగ్రీయంగ్‌ మన్‌ రాజశేఖర్‌ గత సంవత్సరం ‘గరుడవేగ’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రం తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా సెటిల్‌ అవ్వాలనుకున్న రాజశేఖర్‌ ఆ చిత్రం సక్సెస్‌ అవ్వడంతో మళ్లీ హీరోగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో తన పెద్ద కూతురు శివాని మూవీని కూడా ఆయన షురూ చేశాడు. శివాని హీరోయిన్‌గా 2 స్టేట్స్‌ మూవీ రీమేక్‌ అవుతుంది. ఆ చిత్రంలో అడవి శేషుకు జోడీగా శివాని నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక రాజశేఖర్‌ తన రెండవ కూతురు శివాత్మికను విద్యారంగంలో సెటిల్‌ చేయాలని భావించాడు.

Hero Rajasekhar Takes Sensational Decision About Daughter Shivatmika-

Hero Rajasekhar Takes Sensational Decision About Daughter Shivatmika

శివాని హీరోయిన్‌గా ప్రస్తుతం రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఆ రెంటిలో ఒకటి ఈ ఏడది, రెండవది వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ రెండు చిత్రాలు ఇంకా విడుదల కాకుండానే శివాని చెల్లి శివాత్మిక సినీ ఎంట్రీకి సిద్దం అవుతుంది. రాజశేఖర్‌ తన చిన్న కూతురు శివాత్మికను ఇండస్ట్రీకి తీసుకు రావద్దని మొదటి నుండి అనుకున్నాడు. ఆమెకు ఉన్న నాలెడ్జ్‌కు మంచి బిజినెస్‌ఉమెన్‌ అవుతుందని రాజశేఖర్‌ దంపతులు అనుకునేవారట.

రాజశేఖర్‌ దంపతులు తీసుకున్న నిర్ణయం తారుమారు అయ్యింది. శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అయ్యేందుకు రంగం సిద్దం అవుతుంది. శివానితో పోల్చితే శివాత్మికకు హీరోయిన్‌గా సక్సెస్‌ అయ్యేందుకు ఎక్కువ స్కోప్‌ ఉందని, జీవిత తాలూకు పోలికు మరియు రాజశేఖర్‌ తాలూకు చార్మింగ్‌ చిన్నమ్మాయిలో కనిపిస్తున్నాయి అంటూ సినీ వర్గాల వారు చెప్పడంతో శివాత్మికను హీరోయిన్‌గా పరిచయం చేయాలని జీవిత రాజశేఖర్‌లు ఫిక్స్‌ అయ్యారు.

Hero Rajasekhar Takes Sensational Decision About Daughter Shivatmika-

శివాని మొదటి సినిమా రిలీజ్‌ అయిన తర్వాత శివాత్మిక మొదటి సినిమా ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే శివాత్మిక హీరోయిన్‌ అయ్యేందుకు నటనపై దృష్టి పెట్టడంతో పాటు, బరువు 7 కేజీలు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఒక స్టార్‌ దర్శకుడి దర్శకత్వంలో శివాత్మికను పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్‌డం ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే మంచి కెరీర్‌ ఉంటుందనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.