బాలికను రేప్ చేయడానికి వచ్చిన వారిని చీల్చి చెండాడిన పెంపుడు కుక్క...బాలిక క్షేమం..     2018-08-21   15:34:20  IST  Rajakumari K

నిర్భయ లాంటి చట్టాలున్నప్పటికి కామాంధుల అకృత్యాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి..చిన్నపిల్లల్ని కూడా వదలని దుర్మార్గులు మొన్నటికి మొన్న మూగజీవిపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా ఒక మైనర్ బాలికను అత్యాచారం చేయడానికి ఇద్దరు ప్రయత్నించగా..ఆ అమ్మాయి పెంపుడు కుక్క వారి పాలిట కాలభైరవుడిగా మారి,ఆ ఇద్దరిని చీల్చిచెండాడి పారిపోయేలా చేసింది..తనను అల్లారుముద్దుగా చూసుకునే యజమానిని రేప్ నుండి రక్షించింది..

Hero Pit Bull Puppy Saves Teen From Attempted Rape-

Hero Pit Bull Puppy Saves Teen From Attempted Rape

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ఖరాయి సమీపంలో ఓ గ్రామంలో చోటుచేసుకుంది ఈ ఘటన..ఇంట్లో ఒంటిరిగా ఉన్న మైనర్ బాలికను గమనించిన రేషు అహిర్వార్, పునీత్ అహిర్వార్ అనే యువకులు తనని రేప్ చేయాలని భావించారు.అంతే వెంటనే బాలిక ఇంట్లోకి వెళ్లి,తనని లాక్కొచ్చి పశువుల దాణా గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో,తనకు తోడుగా ఉన్న తన పెంపుడుకుక్కను సహాయం కోసం పిలిచింది.ఆమె నమ్మకాన్ని వమ్ముచేయని ఆ శునకం ఆగమేఘాల మీద వచ్చి వారిపై దాడి చేసింది. దీంతో వారిద్దరూ ప్రాణాలపై తీపితో పారిపోయారు.

Hero Pit Bull Puppy Saves Teen From Attempted Rape-

తన యజమాని ఆపదలో ఉందని భావించిన ఆ పెంపుడు కుక్క పెద్దగా మొరుగుతూ చుట్టుపక్కల వారిని సైతం అప్రమత్తం చేసింది. కుక్క గట్టిగా మొరగడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకుని బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు.