సైరా.. లో బాలకృష్ణ నటిస్తున్నాడా ఏంటీ..ఒకవేళ నటిస్తే పరిస్థితి..     2018-08-28   12:41:27  IST  Ramesh Palla

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రంలో పలువురు స్టార్స్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో గత సంవత్సర కాలంగా చిత్రం చిత్రీకరణ జరుగుతూనే ఉంది. అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు ఇంకా ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో బాలకృష్ణ కూడా నటిస్తున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ‘సైరా’ సెట్స్‌కు బాలకృష్ణ వెళ్లడం జరిగింది. సెట్స్‌లో దాదాపు రెండు గంటల పాటు బాలయ్య గడిపినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Hero Balakrishna To Act In Chiranjeevi Saira Narasimha Reddy-

Hero Balakrishna To Act In Chiranjeevi Saira Narasimha Reddy

‘సైరా’ చిత్రం సెట్స్‌లో బాలయ్య కనిపించడంతో అంతా కూడా ఈ చిత్రంలో బాలయ్య కూడా నటిస్తున్నాడా అంటూ చర్చించుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్‌ కూడా సైరా చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతంకు కాస్త దూరంలోనే ఉంది. అందుకే చిరంజీవిని ఒకసారి కలిసి వెళ్లాలనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ సైరా సెట్స్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతే తప్ప సైరా చిత్రంలో బాలకృష్ణ నటించడం లేదు అంటూ మెగా వర్గాల వారు క్లారిటీ చెబుతున్నారు.

Hero Balakrishna To Act In Chiranjeevi Saira Narasimha Reddy-

హీరోలుగా ఇద్దరి మద్య పోటీ ఉన్నా కూడా ఇద్దరు మంచి స్నేహితులు. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం వేడుకలో చిరంజీవి ప్రధాన అథితిగా పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ తర్వాత పలు సందర్బాల్లో కూడా ఇద్దరు కలుసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడు కలుసుకున్నా కూడా సంచలనమే. ఇద్దరు మంచి స్నేహితులు అవ్వడంతో, ఇద్దరు కూడా కలిసి ఒక చిత్రంను చేస్తే చూడాలని గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాని అది మాత్రం తీరడం లేదు. సైరాతో అయినా అది తీరుతుందని కొత సమయం వారు భావించారు. కాని అది పుకారే అని తేలడంతో ఉసూరుమంటున్నారు.