తండ్రిపై ప్రేమను చాటుకున్న ఎన్టీఆర్‌, హ్యాట్సాప్‌ అనాల్సిందే!     2018-08-30   08:13:14  IST  Ramesh Palla

హరికృష్ణ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా నాన్న అంటే ప్రాణం ఇచ్చే ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తండ్రికి యాక్సిడెంట్‌ అయ్యింది అనగానే హైదరాబాద్‌ నుండి హుటాహుటిన నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు వెళ్లిన ఈ ఇద్దరు అన్నదమ్ముళు తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే కుప్పకూలినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. కన్నీరు పర్యంతం అయిన ఎన్టీఆర్‌ కొద్ది సేపటి తర్వాత తేరుకుని జరగాల్సిన కార్యక్రమాలు చూశాడు.

Harikrishna Body On Ntr Hands-

Harikrishna Body On Ntr Hands

హాస్పిటల్‌ నుండి త్వరలో హైదరాబాద్‌లోని ఇంటికి హరికృష్ణ మృత దేహంను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ మృతదేహంతో పాటు ఆంబులెన్స్‌లోనే ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ రావడం జరిగింది. ఆ తర్వాత ఆంబులెన్స్‌ నుండి హరికృష్ణ మృతదేహంను స్వయంగా ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు తమ చేతులతో కిందకు దించి, ఇంట్లోకి తీసుకు వెళ్లడం జరిగింది. తండ్రి మృతదేహంను చాలా జాగ్రత్తగా కిందకు దించాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లు స్వయంగా తమ చేతులతో దించడం జరిగింది.

తండ్రిపై ఎన్టీఆర్‌కు ఉన్న ప్రేమ ఈ సంఘటనతో తేలిపోయింది. తండ్రితో ఎన్టీఆర్‌కు చాలా అనుబంధం ఉంది. ఆ అనుభందం నందమూరి ఫ్యాన్స్‌కు కూడా చాలా ఇష్టం. హరికృష్ణ, ఎన్టీఆర్‌లు కలిసి వస్తుంటే ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. అలాంటిది మళ్లీ ఇకపై చూడలేం అనుకుంటూ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Harikrishna Body On Ntr Hands-

ఒక గొప్ప నటుడిని హరికృష్ణ తెలుగు ప్రేక్షకులకు ఇచ్చాడు. అలాగే ఒక గొప్ప కొడుకుని కన్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కన్నందుకు హరికృష్ణ రుణం అన్ని విధాలుగా తీర్చుకున్న ఎన్టీఆర్‌ గొప్ప కొడుకు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. తన కొడుకులు తనపై చూపించిన అభిమానం, ప్రేమతో ఆ తండ్రి ఎక్కడా ఉన్నా ఆత్మ శాంతిస్తుందని నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లను మెచ్చుకుంటున్నారు.