బస్సు లో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు..! ఆ అబ్బాయి ఇచ్చిన కౌంటర్ హైలైట్.!  

దిల్ సుఖ్ నగర్ నుండి హైటెక్ సిటి వైపుగా బయలుదేరింది పుష్పక్ బస్…. ఒకటి, రెండు సీట్లు మినహా బస్ అంతా ఆల్ మోస్ట్ ఫుల్ గా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ పక్కపక్కనే కూర్చొని కంపెనీ కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్ లక్డికపూల్ చేరగానే జనాలంతా ఎగబడి , ఎగబడి ఎక్కారు. ఇంతకు ముందు చెప్పిన ఫ్రెండ్స్ ముందు ఓ సీటు ఖాళీగా ఉండడంతో.. ఇద్దరమ్మాయిలు ఫాస్ట్ గా ఆ సీట్ వైపుగా దూసుకొచ్చారు. ఓ అమ్మాయి దూరం నుండే ఆ సీట్ మీద హ్యాండ్ బ్యాగ్ వేసింది. మరో అమ్మాయి ఆ సీటు దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసేసి కూర్చుంది. ఓ 10 మంది దాకా నిలబడి ఉన్నారు.

Girls Fighting For Bus Seat In Dilsukhnagar Hyderabad-

Girls Fighting For Bus Seat In Dilsukhnagar Hyderabad

ఇంతలో హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి ఆ సీట్ దగ్గరికి వచ్చి ఎక్స్ క్యూజ్ మీ….ఇది నా సీట్ , మీరు లేవండి ప్లీజ్ అంది. దానికి కూర్చున్న ఆ అమ్మాయి నో…నేనే ఫస్ట్ వచ్చి కూర్చున్న అని చెప్పింది. లేదు నేను ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వేశాను, తర్వాత మీరొచ్చి కూర్చున్నారని ఆమె, అయినా…కర్చీఫ్ లు , హ్యాండ్ బ్యాగ్ లు వేయడానికి ఇదేమైనా పల్లెవెలుగు బస్సా అంటూ కోపానికొచ్చింది కూర్చున్న అమ్మాయి ….. బస్ లోని జనాలంతా వీరివైపే చూస్తున్నారు. అది గమనించి ఎలాగైనా సీట్ దక్కించుకోవాలని ఇద్దరు పోటీ పడుతున్నారు. చిన్నపాటి గొడవ జరుగుతుంది.

పక్క సీట్లో ఉన్న ఆ కుర్రాడు…ఎక్స్ క్యూజ్ మీ…అన్నాడు. ఏంటీ అన్నట్టు చూశారు ఆ ఇద్దరమ్మాయిలు, వారితో పాటు బస్ లోని జనాలు కూడా ఆ అబ్బాయి మీద దృష్టి సారించారు. సీట్ కోసం పోట్లాట ఎందుకు నేను ఓ మాట చెబుతాను దానికి తగ్గట్టు మీలో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఆ సీట్లో కూర్చోవాలో వద్దో అని అన్నాడు. ఏంటీ అన్నట్టు ఆ అమ్మాయిలతో పాటు, బస్ లోని జనాలందరు అతడు చెప్పే మాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Girls Fighting For Bus Seat In Dilsukhnagar Hyderabad-

ఎం లేదు..మీలో వయస్సులో ఎవరు పెద్దో వారు ఆ సీట్లో కూర్చొండి.. పెద్దలను గౌరవించండి అనే ఫార్ములాను ఫాలో అవుదాం అన్నాడు. అంతే…అప్పటి వరకు కుర్చీలో కూర్చొని ఉన్న అమ్మాయి ఠక్కున లేచి..సారీ మేడమ్ మీరే కూర్చొండి అంటూ ఆమెకు సీట్ ఇచ్చింది. దానికి ఆ హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి సారీ….సారీ…మీరే కూర్చొండి, ఆ సీట్ మీకే అంటూ సీటుకు దూరంగా జరిగింది. మేడమ్ కూర్చొండి అని ఆమె, పర్లేదు, పర్లేదు అని ఈమె…ఇద్దరూ సీట్ కు దూరంగా జరిగారు…ఇంతలో మరో 50 యేళ్లకు పైబడిన మహిళ ఆమె థ్యాంక్స్ బాబు, కాళ్లు బాగా నొస్తున్నాయి అంటూ వచ్చి ఆ సీట్లో కూర్చుంది.