పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ తో చెక్....ఎలాగో చూద్దాం     2018-08-21   04:23:17  IST  Laxmi P

పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ ఎలా సహాయపడుతుందా అని ఆలోచిస్తున్నారా? చాలా బాగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చెడు వాసనను తటస్దీకరణ చేసి ఇన్ఫెక్షన్ కి కారణమైన బ్యాక్టీరియాని చంపుతుంది. అంతేకాక చెమటను నిర్మిలిస్తుంది. అయితే పాదాల దుర్వాసనకు అల్లం పేస్ట్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

అల్లంను ముక్కలుగా కోసి కొంచెం నీటిని ఉపయోగించి చిక్కటి ప్యూరీగా తయారుచేయాలి. ఒక కప్పు నీటిని వేడి చేసి ఆ నీటిలో అల్లం ప్యూరీని వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.

Ginger Pulp Beat Smelly Feet-

Ginger Pulp Beat Smelly Feet

పాదాలు దుర్వాసన వస్తున్నప్పుడు ఈ అల్లం మిశ్రమాన్ని రాసి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయటం పూర్తి అయ్యాక పాదాలకు సాక్స్ వేసుకొని రాత్రంతా ఆలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఆ తరవాత కొంచెం కొబ్బరి నూనెను రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. అప్పుడు దుర్వాసన తొలగిపోయి పాదాలు మృదువుగా మారతాయి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నాలుగు రోజుల్లో పాదాల దుర్వాసన మాయం అవుతుంది. పాదాల దుర్వాసన అనేది పిల్లలు షూ వేసుకుంటారు కాబట్టి వారిలో ఎక్కువగా కనపడుతుంది. ఆలా పిల్లల పాదాలు దుర్వాసనగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.