సామ్రాట్‌తోనే లింకు ఎందుకు? అమిత్ నా వేలు నోట్లోపెట్టుకొని నాకాడు.! కౌశల్‌పై గీతా మాధురి డౌట్ ఇదే.!   Geetha Matdhuri Explains About Her Relatinship With Samrat     2018-09-16   06:02:14  IST  Sainath G

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు. మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది. కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి. ఇక కౌశల్ ఆర్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. ఇటీవలే కౌశల్ కి సపోర్ట్ గా 2 కె రన్ కూడా నిర్వహించారు హైదరాబాద్ లో.

సామ్రాట్‌తో మరీ క్లోజ్ అవుతున్నట్టు అనిపిస్తుందని తన బిగ్ బాస్ దోస్త్‌లు దీప్తి, శ్యామలు అనడంతో.. ‘మీరు మరీ కన్జర్వేటివ్‌గా ఆలోచిస్తున్నారు. నాకు నందు (గీతా మాధురి భర్త) తరువాతే ఎవరైనా. సామ్రాట్, తనీష్, రోల్ రైడా, అమిత్‌లతో మాట్లాడుతుంటే నందుతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత మాత్రాన నందు ప్లేస్‌ను రీప్లేస్ చేసే సమస్యేలేదు’ అంటూ కుండబద్దలు కొట్టేసింది గీతా మాధురి. తాజాగా ఇదే విషయంపై మరోసారి బిగ్ బాస్ చర్చ నడిచింది.

గురువారం నాడు జరిగిన 96 ఎపిసోడ్‌లో గీతా మాధురి భర్త.. నందు బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. ఆయన రాక కోసం ఎంతో ఎదురు చూసిన గీతా మాధురి 96 రోజుల తరువాత భర్తను చూసే సరికి ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయింది. ‘బుజ్జీ.. అంటూ పరుగెత్తుకుని వచ్చి భర్తను హద్దుకుని కన్నీళ్లు పెట్టుకుంది. చాలా మిస్ అవుతున్నా.్. అంటూ ఒకర్నొకరు పట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం నందూ.. చెవిలో సామ్రాట్, తనపై వచ్చిన కామెంట్స్‌ సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది గీతా. దీనికి ప్రతిగా.. ఇలాంటివి నువ్ నాకు చెప్తున్నావా? నేను నీకు చెప్తా రా.. అంటూ లోపలికి తీసుకువెళ్లిన నందూ.. గీతా మాధురికి గీతోపదేశం చేశారు. ‘నువ్ నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అంతా తెలుసు. ముందు నేను చెప్పేది విను ‘నేను చాలా పాజిటివ్‌గా చెబుతున్నా.. జాగ్రత్తగా నా మాట విను. నువ్ గేమ్ సూపర్‌గా ఆడుతున్నావ్. నీకో పర్శనాలిటీ ఉంది. దాన్ని నేను చాలా ప్రేమిస్తా.. ఏదైనా తప్పు జరిగితే.. తప్పు అని చెప్పడానికి సంకోచించవు. అది నాకు తెలుసు. కొన్ని వందల మంది నాకు మెసేజ్ లు చేస్తున్నారు గీత అక్కలా మేమూ ఉండాలని.”

Geetha Matdhuri Explains About Her Relatinship With Samrat-

ఇక సామ్రాట్‌తో తన లింకుపై గీతా మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. నేను అందరితో చనువుగా ఉన్నాను. అమిత్ నా వేలు నోట్లో పెట్టుకొని నాకినాడు. రోల్ రైడాతో సన్నిహితంగా ఉన్నాను. అలాంటివేమీ పట్టించుకోకుండా కేవలం సామ్రాట్‌తోనే ఎందుకు లింక్ పెడుతున్నారు అని దీప్తితో గీతా తన బాధను చెప్పుకొన్నది. తనకు, సామ్రాట్‌కు ఉన్న బంధాన్ని కౌశల్ ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఇలా జరగడం వెనుక కౌశల్ ఉన్నాడా? కౌశలే ఇదంతా చేస్తున్నాడా అని గీతా మాధురి డౌట్ పడింది. అయినా నందు ఇవేమీ నమ్మకపోవడం నాకు కొంత ఊరట. ఏది ఏమైనా ఇది మంచిది కాదు అని ఆవేదన వ్యక్తం చేసింది.