కౌశల్ పై కామెంట్స్ చేసినా...గణేష్ ఇంకా ఎలిమినేట్ అవ్వకపోవడానికి కారణం అదేనా.?  

నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ 61 ఎపిసోడ్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. ఏమైనా జరగొచ్చు అనే టాగ్ లైన్ తో స్టార్ట్ అయిన ఈ షోలో కౌశల్ ని టార్గెట్ చేయడం తప్ప కొత్తగా ఏం జరగట్లేదు. కౌశల్ ని టార్గెట్ చేయడం చివరికి కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అవ్వడం కామన్ అయిపొయింది. మరి ఈ సారి కౌశల్ తో గొడవ పెట్టుకుంది పూజ. ఇక కౌశల్ ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ ఆమెనె.! కాకపోతే సరికొత్తగా గణేష్ కూడా కౌశల్ పై కామెంట్స్ చేసాడు..బిగ్‌బాస్‌లో ఇతనికి ఎలిమినేషన్ స్టార్ అని పేరు. అయినప్పటికీ ఎలిమినేషన్స్ నుంచి మాత్రం బయటపడుతూనే ఉన్నాడు. దీనికి కారణమేంటి?

Ganesh Insults Kaushal In Bigg Boss Telugu-

Ganesh Insults Kaushal In Bigg Boss Telugu

కామన్ మ్యాన్ అని చెప్పుకునే ఇతను ఒక ఆర్జే అని తెలుస్తోంది. విజయవాడలో రేడియో జాకీగా పనిచేస్తున్నాడని సమాచారం. రీసెంట్‌గా ఒక ఎపిసోడ్‌లో తను ఏడవడానికి కారణాన్ని వివరిస్తూ ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీలు తిరిగానని.. రూ.8వేలు ఇస్తే చాలని ఫీలయ్యానని చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ గణేష్‌పై కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

అతను కామన్ మ్యాన్ కాదని.. పెద్దపెద్ద వాళ్లతో అతనికి పరిచయాలున్నాయని.. కాస్ల్టీ కార్లు, చాలా పెద్ద పెద్ద హోటల్స్‌లో గణేష్ స్టే చేస్తాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పిక్స్ అతని ఫేస్‌బుక్, ట్విటర్‌లో కనిపిస్తుండటంతో అవి బాగా వైరల్ అవుతున్నాయి.

Ganesh Insults Kaushal In Bigg Boss Telugu-

గణేష్‌ని ప్రేక్షకులు చాలా లైట్ తీసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరైతే కౌశల్‌తో ఎక్కువ వివాదాలు పెట్టుకుంటున్నారో వారే ఇప్పటి వరకూ బయటకు రావడం జరుగుతోంది. కానీ గణేష్ పెద్దగా వివాదాలు పెట్టుకోడు అలాగని అనుకూలంగానూ ప్రవర్తించడు. సైలెంట్‌గా చేసేదంతా చేసుకుపోతుంటాడు. ఎక్కువగా ప్రేక్షకుల్లో సింపతీ రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు. వేరే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం వల్ల అతను ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు. వేరే వాళ్ళు ఇతనికంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. కౌశల్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అందుకే కౌశల్ ఆర్మీ వాళ్ళని టార్గెట్ చేసే బిజీలో గణేష్ ని లైట్ తీసుకుంటున్నారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే వచ్చే వారం గణేష్ కి ఎలిమినేషన్ తప్పేలా లేదు.!