ధాయ్ భారతీయుల కాల్చివేత..   Foreign Tourist Attack In Gang Shooting Near Bangkok     2018-10-09   13:08:00  IST  Surya

అనుకోని సంఘటన కారణంగా థాయ్‌లాండ్‌లో రెండు వర్గాల మధ్య కాల్పులలో భారత్ నుంచీ పర్యటనకి వెళ్ళిన భారతీయుడు ఒకడు దుర్మరణం పాలయ్యారు..,మరొక ఇద్దరు భారతీయులు గాయపడగా వారికి ఆసుపత్రి లో చికిత్స జరుగుతోంది వారి పరిస్థితి కూడా తీవ్రంగా ఉందని తెలుస్తోంది..ఈ ఘటనపై ధాయ్ ప్రభుత్వం తన సంతాపాన్ని ప్రకటించింది నిందితులని పట్టుకుని ఖటినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది…వివరాలలోకి వెళ్తే..

గాఖ్‌రెజర్‌ ధీరజ్‌ అనే ఓ భారతీయ పర్యాటకుడు థాయ్‌ పర్యటించాడు. అతడు ఉన్న ప్రాంతంలో ఒక్క సారిగా రెండు గ్యాంగ్ ల మధ్య హోరా హోరీగా కాల్పులు జరిగాయి..అయితే ఆ ఘటన ప్రాంతంలోనే ఈ పర్యాటకుడు కూడా ఉండటంతో అతడికి తీవ్రంగా బుల్లెట్లు తగిలాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.

Foreign Tourist Attack In Gang Shooting Near Bangkok-

ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రత్‌చథేవీలోని సెంటారా వాటర్‌గేట్‌ పవిల్లియన్‌ హోటల్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది…అయితే ఈ సంఘటనలో భారతీయులతో పాటు లావోస్‌కు చెందిన కియోవోంగ్సా థోనెకియో అనే పర్యాటకుడు కూడా మృతి చెందాడని పోలీసులు చెప్పారు.