కడుపు నింపే అద్భుతమైన ఆహారాలు  

కొన్ని ఆహారాలను తీసుకుంటే చాలా సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. అంతేకాక తొందరగా ఆకలి కూడా వేయదు. ఇలాంటి ఆహారాలు బరువు తగ్గాలని అనుకొనే వారికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పాప్ కార్న్
పాప్ కార్న్ లో కేలరీలు తక్కువగా పీచు సమృద్ధిగా ఉంటుంది. పాప్ కార్న్ తిన్నప్పుడు ఎక్కువ సేపు తిన్న భావన మరియు కడుపు నిండిన భావన రెండు కలుగుతాయి. అయితే వెన్నకు సంబందించిన పాప్ కార్న్ కి దూరంగా ఉండటమే మంచిది.

Foods Make You Feel Full Aid-

Foods Make You Feel Full Aid

ఓట్ మీల్
ఓట్ మీల్ లో కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉండుట వలన జీర్ణం కావటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల శక్తి చాలా నిదానంగా వస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఓట్ మీల్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే చాలా మంచిది.

బాదం మరియు ఆక్రోట్లు
వీటిలో కావలసినంత పీచు, ప్రొటీన్లు, కొవ్వు మినరల్స్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు పెరగకుండా శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.

Foods Make You Feel Full Aid-

కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులు కొవ్వు తీసిన ఛీజ్, పెరుగు వంటివి కొవ్వు కరిగించే కాల్షియంను శరీరానికి సమృద్ధిగా అందిస్తాయి. తగిన కాల్షియం తీసుకోపోతే కొవ్వు అధికంగా నిల్వ వుంటుందని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి.

బీన్స్
ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండుట వలన జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది.అందువల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. మరల తినాలన్న భావన కలగదు.