డిమాండ్స్‌కు ఓకే చెప్పించుకుంది.. చివరకు ఓకే చెప్పింది     2018-08-11   12:57:15  IST  Ramesh Palla

‘చందమామ’ బ్యూటీ కాజల్‌ టాలీవుడ్‌లోని దాదాపు స్టార్‌ హీరోలందరితో నటించేసింది. దాదాపు పుష్కర కాలంగా కాజల్‌ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతూ వస్తుంది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా సినిమాలు చేసింది. కాని తెలుగులోనే ఈమె ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతటి స్టార్‌ హీరోయిన్‌ అయినా కొన్నాళ్లకు ఫేడ్‌ ఔట్‌ అవ్వాల్సిందే. కాజల్‌ విషయంలో కూడా అదే జరుగుతుందని గత సంవత్సరం అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా కాజల్‌ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ కెరీర్‌లో ముందుకు దూసుకు పోతూనే ఉంది.

Finally Actress Kajal To Work With Hero Rajashekar-

Finally Actress Kajal To Work With Hero Rajashekar

స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌ ప్రస్తుతం చిన్న హీరోలతో నటించేందుకు ఓకే చెబుతుంది. కళ్యాణ్‌ రామ్‌, రానా, శర్వానంద్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి హీరోలతో నటించి, నటిస్తున్న కాజల్‌ రాజశేఖర్‌తో మాత్రం నటించేందుకు నో చెప్పిందట. ‘అ!’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగ ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ను అనుకున్నారు. కాని కాజల్‌ మొదట బిజీ షెడ్యూల్‌ అంటూ నో చెప్పిందట. రెండు మూడు సార్లు దర్శకుడు కాజల్‌ను సంప్రదించడంతో తప్పనిసరి పరిస్థితిలో కొన్ని కండీషన్స్‌ పెట్టి మరీ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

హీరో రాజశేఖర్‌తో మూవీ అంటే కొన్ని ఇబ్బందులు సెట్స్‌లో ఉంటాయి. ఆ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, దాంతో పాటు పారితోషికం 1.75 కోట్లు ఇవ్వాల్సిందే. పారితోషికం విషయంలో ఓకే చెప్తే కథలో తన పాత్ర నిడివి పెంచాలని, తన సీన్స్‌ ప్రాముఖ్యత ఉండేలా స్క్రీన్‌ప్లే ఉండాలి అంటూ కండీషన్స్‌ పెట్టింది. ఈ మూడు కండీషన్స్‌కు కూడా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మరియు రాజశేఖర్‌ ఒప్పుకున్నారు. రాజశేఖర్‌ మూవీలో కాజల్‌ నటించేందుకు కాస్త డిమాండ్‌లు ఎక్కువే చేసింది.

Finally Actress Kajal To Work With Hero Rajashekar-

ఇతర హీరో అయితే కాజల్‌ను కాదని మరో హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని చేసేవాడు. కాని రాజశేఖర్‌తో నటించేందుకు సీనియర్‌ హీరోయిన్స్‌ ఎవరు ఆసక్తిగా ఉండరు. ప్రస్తుత హీరోయిన్స్‌ ఆయనకు సూట్‌ అవ్వరు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజశేఖర్‌ ఆమె డిమాండ్‌కు ఓకే చెప్పాల్సి వచ్చింది. కాజల్‌ చిన్న హీరోతో చేస్తున్నా కూడా భారీ పారితోషికంను అందుకుంటూనే ఉంది. కాజల్‌ వచ్చే ఏడాది రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కాజల్‌ చాలా తెలివిగా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటూ ఉంది.