ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ బుక్..ధర కేవలం 20లక్షలే  

ఒక బుక్ రేట్ ఎంతుంటుంది వందల్లో ఉంటుంది..మహా అంటే వేలల్లో ఉంటుంది.కాని లక్షల్లో ఖరీదు చేసే పుస్తకాన్ని చూసారా?కానీ ఈ పుస్తకం ఖరీదు అక్షరాలా ఇరవై లక్షల రూపాయలు..అంత రేట్ పెట్టి కొనడానికి ఆ పుస్తకంలో ఏముంది..యమధర్మరాజు దగ్గర ఉండే భవిష్యవాణి కాదు కదా అనుకుంటున్నారా..నిజంగా భవిష్యవాణి ఉంటే దాని ఖరీదు ఎంతుంటుందో కాని ఈ పుస్తకం మాత్రం ప్రపంచంలోనే విలువైన పుస్తకంగా పేరుగాంచింది..ఆ పుస్తకమే “ఫెరారి”

Ferrari Collectible Art Book Will Cost You Over Rs 20 Lakh-

Ferrari Collectible Art Book Will Cost You Over Rs 20 Lakh

ఫెరారి ఇది కారు కదా..అవును ఫెరారి కార్ల కంపెని ఇటీవల ఒక బుక్ రిలీజ్ చేసింది..ఆ కార్ల్ లానే ఆ పుస్తకం కూడా చాలా కాస్ట్లీ.ఇటలీకి చెందిన ఫెరారి కార్ల కంపెని ఆ కార్ల చరిత్ర గురించి సమగ్ర సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందు పరిచి అమ్మకానికి పెట్టారు..మంచి ఫోటోలతో సహా ముద్రించామని చెప్తున్నా ఈ పుస్తకం ఖరీదు 20లక్షలు.మొత్తం 1,947 పుస్తకాలను ముద్రించారరు.కానీ వాటిల్లో కేవలం 250 పుస్తకాలకు మత్రమే పైన చెప్పిన రేటు వర్తిస్తుంది. మిగతా 1,697 పుస్తకాలు రూ.4.1 లక్షలకు అమ్ముతున్నారు. అదేంటి అన్నీ ఒకే రకం పుస్తకాలైనప్పుడు రేట్లలో తేడా ఏంటి అనుకుంటున్నారా. ఈ పుస్తకాలకు డిజైనర్‌ స్టాండ్‌లాంటి అదనపు హంగులు ఉండకపోవడమే కారణమట.

514 పేజీలుండే ఆ పుస్తకాన్ని ఉంచిన స్టాండ్‌ కోసమే అంత రేటు అంటున్నారు. ఈ పుస్తకాన్ని మ్యూజియంలకు, ఫెరారీ కార్లను ఎక్కువగా కొనే వినియోగదారులకు మాత్రమే అమ్ముతారట. చూడ్డానికి ఫెరారీ 12 సిలెండర్ల ఇంజిన్‌లా ఉంటుంది స్టాండ్. స్టీల్‌పై క్రోమియం పూత వేసి తయారుచేశారు. అల్యూమినియం పెట్టెలో ఉంచారు. ఈ బుక్‌ స్టాండ్‌ను డిజైనర్‌ మార్క్‌ న్యూసన్‌ రూపొందించారట.