ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెడుతున్న వార్త     2018-08-10   12:37:00  IST  Ramesh Palla

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్నాడు. జైలవకుశ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌ ఈ చిత్రం కోసం సిక్స్‌ ప్యాక్‌ను ట్రై చేశాడు. లేట్‌ అయినా కూడా సినిమా ఖచ్చితంగా లేటెస్ట్‌గా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్‌ ఈ చిత్రం కోసం కోటి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Fans Tension About NTRs Aravinda Sametha-

Fans Tension About NTRs Aravinda Sametha

సినిమా ఆరంభం నుండే దసరాకు విడుదల చేస్తాం అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ చెబుతూ వచ్చాడు. ముందుగా అనుకున్న తేదీకి విడుదల చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అది సాధ్యం కావడం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతున్నప్పటికి విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే యూరప్‌లో పాటల చిత్రీకరణకు ప్లాన్‌ చేశాడు. వచ్చే నెల 20 వరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ టార్గెట్‌ పెట్టుకున్నాడు. కాని అప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అయ్యేలా కనిపించడం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పాటల చిత్రీకరణ తర్వాత కూడా కొంత టాకీ పార్ట్‌ను షూట్‌ చేయాల్సి ఉంది.

Fans Tension About NTRs Aravinda Sametha-

దర్శకుడు త్రివిక్రమ్‌ ఎప్పుడు ఏది చేసినా కూడా పక్కా ప్లాన్‌తో చేస్తాడు. కాని ఈసారి మాత్రం ఆయన ప్లాన్‌ తప్పేలా ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాటల మాంత్రికుడు తాను అన్నమాటకు కట్టుబడి సినిమాను దసరాకు విడుదల చేసేందుకు క్వాలిటీ లేకుండా సీన్స్‌ను తెరకెక్కిస్తాడో లేదంటే క్వాలిటీ కోసం కొన్ని రోజులు చిత్రాన్ని వాయిదా వేస్తాడో చూడాలి. ఈ చిత్రం టీజర్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేయబోతున్నారు.