'పవన్' ఫై భారీ కుట్ర..రంగంలోకి... 'ఆ ఫ్యాన్స్'.   Fake Fans Wants To Attacks On Janasena Pawan Kalyan     2018-09-26   11:53:22  IST  Bhanu C

ఏపీలో జనసేన పార్టీ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టానని జనసేనాని తెలిపిన మరిక్షణం ఏపీలో జనసేన వర్గానికి చెందిన నేతలు, అభిమానులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు..ముఖ్యంగా పవన్ వస్తే రాజకీయాల్లో మారు సాధ్యం అవుతుందని , స్మాన్యులకి న్యాయం జరుగుతుందని భావించిన మానవతా వాదులు స్వచ్చంద సంస్థల నేతలు అందరూ ఎదురు చూస్తున్నారు అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా ప్రజా పోరాట యాత్రాలని చేపట్టడంతో జనసేన పార్టీ మాంచి ఊపందుకుంది..ఇదిలాఉంటే..

జనసేన పార్టీకి రోజు రోజుకి దళితులు లాగే శ్రామికుల నుంచీ మద్దతు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రత్యర్డులు అరెల్ట్ అయ్యారని తెలుస్తోంది..ఎలాగైనా సరే జనసేన స్పీడుకి బ్రేకులు వేయాలని అనుకున్న వారు పవన్ వెనుకాల భారీ కుట్రని వ్యుహాలని రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది..పవన్ పరువుని బజారుకి ఈడ్చే పనిలో వారు సిద్దంగా ఉన్నారట అందులో భాగంగానే ఒక పార్టీకి చెందినా ఐటీ టీం ఏకంగా పవన్ పై బురద జల్లడానికి పెద్ద వ్యూహాన్ని రచించిందట విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..

ప్రజారాజ్యం ఏపీలో స్పీడు పెంచుతూ ప్రజలలో దూసుకుపోతున్న సమయంలో ఏ పార్టీ అయితే చిరుపై తన ఫ్యాన్స్ గా చెప్పుకునే ఫేక్ ఫ్యాన్స్ ద్వారా మాటల దాడులు చేయించాయో అలాగే జనసేనుడి పై కూడా ఇదే రీతిలో ఫేక్ ఫ్యాన్స్ ద్వారా దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోందట అంతేకాదు ఈ విషయంపై రెండు రోజుల క్రితం వారందరూ సమావేశం పెట్టుకుని మరీ చర్చించుకున్నారని టాక్ వినిపిస్తోంది అయితే ఇంతకీ పవన్ పై జరిగే ఈ కుట్రల కోసం ఏమి చేయబోతున్నారు అంటే..

Fake Fans Wants To Attacks On Janasena Pawan Kalyan-

జనసేన పార్టీ పేరుపై నకిలీ పేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో నమ్మకమైన ఫ్యాన్స్ గా ఉంటూ కొంతకాలం తరువాత అంటే ఎన్నికల ముందు జనసేన పార్టీపై విమర్శలు చేస్తూ, జనసేనలో న్యాయం లేదంటూ పవన్ అభిమానులుగా పార్టీ పరువు తీస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేయాలనేది వ్యూహంగా తెలుస్తోందట..ఇలా చేయడం ద్వారా ప్రజలలో పవన్ పై తీవ్ర వ్యతిరేకత తీసుకురావడమే కాకుండా జనసేనలో ఫ్యాన్స్ కే న్యాయం లేదు ఇక ప్రజలు ఏమి చేస్తారు అనే భావన ప్రజలలో కల్పించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అలెర్ట్ అయ్యి ఈ చర్యలని ఎలా తిప్పికోడుతుందో వేచి చూడాల్సిందే.