ఆ స్కూల్లో పాఠాలు నేర్పించరు.మరేం నేర్పుతారు..  

స్కూల్ అంటే ఏం చెప్తారు ..రోజుకు ఆరు పీరియడ్లు పాఠాలు పిల్లలు వింటున్నారో లేదో కూడా అనవసరం టీచర్లకి రుద్దుతూనే ఉంటారు..పొద్దున్నుండి సాయంత్రం వరకు సాగే స్కూల్లో ఒక గంటపాటు పిల్లలతో ఆటలాడించే స్కూల్లు చాలా తక్కువ..ఇక పిల్లలకు సమాజం గురించి,సమాజంలో పరిస్థితులు,సమస్యలు,వాటి పట్ల ఉద్యమాలు ఇలాంటి విషయాలు భోదించే స్కూల్స్ ఉంటాయా…ఉంటాయి అలాంటి స్కూలే బెంగుళూరులో ఉంది..ఆ స్కూల్ పిల్లలకు చదువుస్థానంలో ఏం నేర్పిస్తుందో తెలుసా…

Fairtrade Schools.. Teaching Resources..lesson Plans..videos And More-

Fairtrade Schools.. Teaching Resources..lesson Plans..videos And More

రైతుల ఆత్మహత్యలు, వాటికి దారితీస్తున్న పరిస్థితులు, కూలీల హక్కుల గురించి, ఆహారం ఎలా ఉత్పత్తి అవుతోంది? దుస్తులు ఎలా తయారవుతున్నాయి? వంటి అంశాలును పిల్లలకు నేర్పిస్తారు ఆ స్కూల్లో..పిల్లలూ కూడా వాటిని ఆసక్తిగా తెలుసుకుంటారు.తెలుసుకోవడమే కాదు ఇంటిదగ్గర పేరెంట్స్ కి,ఇరుగుపొరుగు వారికి చెప్తుంటారు. అంతేకాదు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తారు..ఇవన్ని నేర్పే స్కూల్ విద్యాశిల్ప్ అకాడమి బెంగళూరులో ఉంది..ఇప్పటికే ప్రత్యేకమైన పాఠ్యప్రణాళికతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఈ స్కూల్ ఇప్పుడు మొట్టమొదటి ఫెయిర్ ట్రేడ్ స్కూల్ గా కూడా గుర్తింపు పొందింది.

దేశంలోనే మొట్టమొదటి ఫెయిర్‌ట్రేడ్‌ స్కూల్‌గా కూడా గుర్తింపును సాధించింది విద్యాశిల్ప్ అకాడమి.ఇంతకీ ఈ ఫెయిర్ ట్రేడ్ అంటే ఏంటి? ఫెయిర్‌ట్రేడ్‌ అనేది ఒక ఉద్యమం. రైతులకు, రైతు శ్రామికులకు సరైన ప్రతిఫలం దక్కేలా చేయడం, రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం, ఎక్కువ మంది ఆ ఉత్పత్తులు వాడేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. మంచి ధర కల్పించడం, ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవసరమైన వసతిని ఏర్పాటు చేయడం వంటివి ఫెయిర్‌ట్రేడ్‌లో భాగంగా ఉంటాయి.

Fairtrade Schools.. Teaching Resources..lesson Plans..videos And More-

పాఠశాలలో ఫెయిర్‌ ట్రేడ్‌ కాన్సె‌ప్ట్ను ప్రారంభించింది కామర్స్‌ అండ్‌ ఎకనమిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ లీడ్‌ ఎడ్యుకేటర్‌ అయిన రితు బాలి. ‘‘ఒకరోజు ఒక విద్యార్థి ‘లాభాల కోసమే వ్యాపారం చేస్తున్నారు కదా! అవి సామాజిక సేవకు ఎలా ఉపయోగపడతాయి?’ అని ప్రశ్నించడంతో.. చాలా సేపు డిస్కషన్స్‌ జరిగిన తరువాత వ్యాపారాన్ని ఫెయిర్‌ట్రేడ్‌గా చేయడం ద్వారా అనుకున్నది సాధించవచ్చని నిర్ణయానికి వచ్చాం. తరువాత ఆ కాన్సె్‌ప్టని కరిక్యులమ్‌లో చేర్చారట. బట్టి చదువులు నేర్పకుండా విధ్యార్దులను ఈ విధంగా ఎడ్యుకేట్ చేయడం చాలా బాగుంది కదా..