అత్తాపూర్ లో నడిరోడ్డుపై హత్య కేసులో నిజాలు ఇవే.! పోలీసులు, జనం ఆపలేదు అన్నవారు ఇది చదవండి!

హైదరాబాద్ అత్తాపూర్‌లో నడిరోడ్డు మీద దారుణహత్య జరిగింది.కొందరు దుండుగులు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మీద గొడ్డలితో దాడి చేశారు.

 Facts About Attapur Murder Case-TeluguStop.com

పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 143 దగ్గర ఈ దారుణం జరిగింది.

వివరాలలోకి వెళ్తే…మొదట నలుగురు వ్యక్తులు రోడ్డుమీద వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి తన్నారు.

అతను కిందపడిపోవడంతో బాధితుడు కిందపడిపోయాడు.దీంతో తమ వెంట తెచ్చిన గొడ్డలితో అతడి మీద విచక్షణారహితంగా దాడి చేశారు.

కింద రక్తపు మడుగులో పడి నిర్జీవంగా ఉన్న వ్యక్తిని ఓ వ్యక్తి గొడ్డలితో నరుకుతూనే ఉన్నాడు.తనలోని కసి తీరేంత వరకు అలా మెడ మీద కొడుతూనే ఉన్నాడు.

ఆ సమయంలో పక్కనే ఉన్న కానిస్టేబుల్ అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు.కానీ, నిందితుడి చేతిలో గొడ్డలి ఉండడంతో ధైర్యం చేయలేకపోయారు.

ఈ విషయం సరిగా తెలియక సోషల్ మీడియాలో పక్కనే పోలీసులు వెళుతున్నా…చుట్టూ అంత మంది ఉన్నా ఏం ఆపలేదు అని ట్రోల్ చేసారు.అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలియకుండా ఎలా అనేస్తారు.? ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసు వారు రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.

అసలు హత్యకు కారణం ఏంటి.? మరణించింది ఎవరు అనే వివరాలలోకి వెళ్తే.,పాతబస్తీలోని జియాగూడకు చెందిన రమేశ్ (34), మహేశ్ (28) అనే యువకులు చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.

రమేశ్‌కు తన ఇంటిపక్కనే అద్దెకున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది.ఆ విషయం తెలుసుకున్న మహేశ్.ఆ మహిళతో మాట కలిపాడు.

తన లైంగిక కోరిక తీర్చాలని.లేకపోతే వివాహేతర సంబంధం విషయం అందరికీ చెబుతానని బెదిరించాడు.

మహేశ్ తనను వేధిస్తు్న్న విషయాన్ని సదరు మహిళ రమేశ్‌కు చెప్పడంతో.మిత్రులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ తర్వాత మహిళ అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలియడంతో.ఆ కుటుంబం అక్కడ నుంచి ఖాళీ చేసి మరో చోటకు వెళ్లిపోయింది.

మహేశ్ కారణంగానే తన ప్రియురాలు తనకు దూరమైందని రమేశ్ కక్ష పెంచుకున్నాడు.మహిళ విషయం మరిచిపోయి.ఇక నుంచి మంచిగా ఉందామంటూ మిత్రుడు మహేశ్‌ను నమ్మించాడు.పార్టీ ఇస్తున్నానని చెప్పి రమేశ్ గతేడాది డిసెంబర్ 24 రాత్రి తన మిత్రుణ్ని మరోసారి పిలిచాడు.బాగా తాగిన మహేశ్ తిరుగు ప్రయాణంలో కారు సీట్లోనే నిద్రలోకి జారుకున్నాడు.ఇదే అదనుగా భావించిన రమేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అతణ్ని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.

మహేశ్ హత్యతో అతడి తండ్రి, మేనమామ.రమేశ్‌పై కక్ష పెంచుకున్నారు.రమేశ్‌ను ఎప్పటికైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నారు.మహేశ్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న రమేశ్ బుధవారం (సెప్టెంబర్ 26) ఉప్పరపల్లి కోర్టుకు హాజరయ్యాడు.

రమేశ్ తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న సమయంలో అతణ్ని అడ్డగించారు.వారి నుంచి తప్పించుకోవడానికి రమేశ్‌ ఆటో దిగి పరుగెత్తాడు.

అత్తాపూర్‌ 143 పిల్లర్‌ వద్ద బస్టాప్‌లో రమేశ్‌ను పట్టుకున్న దుండగులు నడిరోడ్డుపైనే గొడ్డలితో దారుణంగా నరికి చంపారు.రమేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న దుండగుల్లో ఒకరు ‘‘పెద్ద అల్లుడా పంపిచేశారా.

మహేషా పంపించేశారా నీ కాడికి’’ అని అరుస్తూ ప్రతీకారేచ్చతో రగిలిపోవడం కనిపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube