ఈ పువ్వులను పూజకు వాడకూడదు..వాడినట్లైతే భగవంతుని అనుగ్రహం లభించదు..  

ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ,గుడికి వెళ్లినప్పుడు కాని దేవుడికి సమర్పించేవాటిలో పూలది ప్రధమ స్థానం.అటువంటి పూలను దేవుడికి సమర్పించేటపుడు ఏ పూలు పడితే ఆ పూలతో పూజ చేయకూడదట.చాలామంది ఇంట్లో మొక్కలనుండి తెంపిన పూలను పూజకు వినియోగస్తారు.లేదంటే బయట కొని వాటితో పూజ చేస్తారు.కాని ఆ పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటించాలట..ఆ నియమాలేవో పాటించి ఈ సారి పూజ చేసేటప్పుడు ఆ తప్పులు చేయకండి.

Everything You Need To Know About Flowers Offered Hindu Deities-

Everything You Need To Know About Flowers Offered To Hindu Deities

దేవుడికి పూజ చేసేటప్పుడు సమర్పించకూడని పువ్వులు..

· ఎటువంటి వాసన లేని పూలను,అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట. .

· అలాగే ముళ్లు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు వాడకూడదు.

· వాడిపోయిన పూవులను పూజకు వాడితే అశుభం,కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి.

Everything You Need To Know About Flowers Offered Hindu Deities-

· పరిశుభ్రమైన .. పవిత్రమైన ప్రదేశాల్లో లేని పూల మొక్కల నుంచి కోసిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదు.

· నేలపై పడిన పూలు, పురుగు పట్టిన పూలు,పూర్తిగా వికసించని పూలు దేవుడి పూజకు పనికిరావు.

· హిందువులు కుడిని శుభంగాను,ఎడమను అశుభంగాను పరిగణిస్తారు.అదేవిధంగా భగవంతుడి పూజకు ఉపయోగించే పూలను ఎడమ చేత కోసినట్లైతే పూలు భగవంతుడి పూజకు పనికి రావని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

· పరిశుభ్రమైన .. పవిత్రమైన ప్రదేశంలోని చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పూలను మాత్రమే భగవంతుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందనేది మహర్షుల మాట.