వైరల్ : ఒక యువకుడు పర్సు పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు..దొంగెవరో తెలిశాక ఆశ్చర్యపోయాడు   Dog Steals Man's Wallet And Our Hearts     2018-09-08   08:15:37  IST  Rajakumari K

ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి ఒక షాపులో కూర్చుని పేకాడుతున్నాడు.ఆటలో పూర్తిగా నిమగ్నమయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించుకోలేదు..తీరా ఆట పూర్తయ్యాక లేచి చూసుకునే సరికి,జేబులో ఉన్న అతడి పర్సు మాయమైంది.చుట్టూ వెతికాడు ఎక్కడా దొరకలేదు..దాంతో తన పర్సు ఎవరో కొట్టేశారనే నిర్ధారణకు వచ్చాడు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ యువకుడు పేకాడిన షాపులో ఉన్న సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేసి..దొంగెవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఈ ఘటన చైనాలోని అన్కింగ్ నగరంలో చోటు చేసుకుంది. పర్సులో 2వేల యువాన్‌ (రూ.21వేలు) విలువ చేసే కార్డులు, ఐడీలు ఉన్నాయని ఆ యువకుడు పోలీసుల ఫిర్యాదులో తెలిపాడు.దాంతో దొంగ అతడిని ఫాలో అవుతూనే పర్సు కొట్టేశాడని మొదట అనుకున్నారు. అయితే, చివరికి సీసీటీవీ ఫూటేజ్ చూసిన తర్వాత పోలీసులు, ఆ యువకుడు ఆశ్చర్యపోవడమే కాదు.. కాసేపు నవ్వుకున్నారు కూడా. ఎందుకంటే.. ఆ పర్సును కొట్టేసింది మరెవ్వరో కాదు, ఆ షాపులో ఉన్న ఓ నల్ల కుక్క. ఆ యువకుడు కూర్చునేప్పుడు పర్సు దానికదే కింద పడిపోయింది. దాంతో, ఆ నల్ల కుక్క దాన్ని నోటితో పట్టుకుని ఎంచక్కా బయటకు వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఆ వీడియోను మీరూ చూడండి.