వరదలనుండి ఒక కుటుంబాన్ని కాపాడిన పెంపుడుకుక్క..ఆ కుక్కే లేకపోతే ఆ కుటుంబం     2018-08-13   15:14:24  IST  Rajakumari K

భారీవర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే..వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి,కొండచరియలు విరగిపడుతున్నాయి..రహదారులు కొట్టుకుపోయాయి.ఆకాశంలోనుండి చూస్తే మొత్తం వరదనీటిలోనే కేరళ మునిగి ఉందా అన్నట్టుగా ఉంది పరిస్థితి.ఇప్పటికే పదులసంఖ్యలో మనుషులు మరణించగా ,మరో కుటుంబం కూడా బలయ్యేదే కానీ వరదబీభత్సాన్ని ముందుగా గుర్తించిన పెంపుడుకుక్క ఆ కుటుంబాన్ని కాపాడింది..

Dog Saves Kerala Family From Devastating Landslide-

Dog Saves Kerala Family From Devastating Landslide

కేరళలోని కంజికూజిలో తెల్లవారుఝామున తీవ్రంగా వర్షం కురుస్తోంది. దీంతో పక్కనే ఉన్న కొండచరియలు విరిగిరిపడుతున్నాయి.బయట వాతావరణాన్ని గుర్తించని కుటుంబం ఆదమరిచి నిద్రపోతుంది. మోహనన్‌ అనే వ్యక్తి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కొండచరియలు విరిగిపడడం చూసి పెద్దగా అరవడం మొదలు పెట్టింది..తన ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఆలోచన కంటే నిద్రలో ఉన్న తన యజమాని కుటుంబాన్ని నిద్రలేపాలనే తాపత్రయంతో వారు పడుకున్న గది దగ్గరకి వచ్చి పెద్దగా అరుస్తుంది.దాంతో మొదట నిద్ర డిస్టర్బ్ అయినట్టుగా కుక్కని కసిరిన మోహనన్,పదేపదే కుక్క పెద్దగా అరవడంతో బయటకు వచ్చి చూశాడు.దీంతో కొండచరియలు ఇంటి ముందు పడి ఉన్నాయి. వర్షపునీరు ఇంటి చుట్టూ చేరి ఉంది..

ప్రమాదాన్ని గుర్తించినమోహనన్ వెంటనే కుటుంబసభ్యులందరిని నిద్రలేపి,ఇంట్లో నుండి బయటికి వచ్చి దగ్గరలో ప్రభుత్వం ఏర్పాటు సురక్షిత స్థావరాలకు తీసుకునివెళ్లాడు. తెల్లవారేసరికి వరద ఉద్ధృతికి మోహనన్ ఇల్లు పూర్తిగా నీటమునిగింది.తమ కుక్కే లేకపోతే ఈ పాటికి మా ప్రాణాలు పోయుండేవని కన్నిటిపర్యంతమవుతున్నారు ఆ కుటుంబ సభ్యులు..