ఏ వ్యక్తికి ఏ వయసులో లక్ కలిసి వస్తుందో తెలుసుకోండి..డెస్టిని నంబర్ బట్టి..     2018-08-21   14:17:24  IST  Rajakumari K

ఎంత కష్టపడినా కొందరిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది..అందుకే కష్టపడడంతో పాటు వన్ పర్సంట్ లక్ అనేది ఉంటేనే ఏదైనా సాధ్యం అనేది నమ్ముతుంటారు కొందరు.. ల‌క్ అనేది జీవితంలో అంద‌రికీ క‌ల‌సి రాదు.కొంద‌రైతే ఎప్పుడూ దుర‌దృష్టం వెంటాడుతుంద‌ని బాదపడుతుంటారు. జ‌న్మించిన తేదీ, నెల‌, సంవ‌త్స‌రం ప్ర‌కారం వారికి జీవితంలో ఎప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో, ఎప్పుడు అదృష్ట‌వంతులుగా మారుతారో ఇట్టే తెలుసుకోవ‌చ్చు.. అందుకోసం మీ డెస్టినీ నంబ‌ర్‌ తెలిస్తే చాలు..డెస్టిని నంబర్ ఎలా తెలుసుకోవాలంటే.…

Do You Know The Person When He Gets Luck-

Do You Know The Person When He Gets Luck

మీ పుట్టిన తేదీ ఉదాహ‌ర‌ణ‌కు… డిసెంబర్ 15, 1987 అనుకుందాం. అప్పుడు తేదీ 15, నెల 12, సంవ‌త్సరం 1987 క‌దా. ఈ క్ర‌మంలో 15 +12 + 1987 ఈ మూడు సంఖ్య‌ల‌ను క‌ల‌పాలి. అప్పుడు 2014 వ‌స్తుంది. తిరిగి ఈ సంఖ్య‌లో ఉన్న అంకెల‌ను కూడా క‌ల‌పాలి. 2+0+1+4. మొత్తం 7 వ‌స్తుంది. ఇదే నంబ‌ర్ ఆ తేదీన పుట్టిన వారి డెస్టినీ నంబ‌ర్ అవుతుంది. ఈ క్ర‌మంలో డెస్టినీ నంబ‌ర్ ప్ర‌కారం ఎవ‌రికి ఏయే సంవ‌త్స‌రంలో ఉన్న‌ప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డెస్టినీ నంబ‌ర్ 1 వ‌చ్చిన వారికి 22, 34 సంవ‌త్స‌రాల్లో ల‌క్ క‌లసి వ‌స్తుంద‌ట‌. సూర్య గ్ర‌హం ప్ర‌భావం వ‌ల్ల వారు ఆ వ‌య‌స్సులో శుభ ఫ‌లితాల‌ను పొందుతార‌ట‌. అదృష్టం బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. అనేక అవ‌కాశాలు త‌లుపు త‌డుతాయ‌ట‌.

2. డెస్టినీ నంబ‌ర్ 2 వ‌చ్చిన వారికి 24, 38 సంవ‌త్స‌రాల్లో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. చంద్రుడి ప్ర‌భావం వ‌ల్ల వీరికి ఆ వ‌య‌స్సులో మిక్కిలిగా ధ‌నం సిద్దిస్తుంద‌ట‌.

3. డెస్టినీ నంబ‌ర్లు 3, 5 వ‌చ్చిన వారికి 32వ సంవ‌త్స‌రంలో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారికి అనుకున్న‌వి నెర‌వేరుతాయి. బృహ‌స్ప‌తి, బుధ గ్ర‌హాల వ‌ల్ల వారికి అదృష్టం క‌లుగుతుంది.

4. డెస్టినీ నంబ‌ర్ 4 వ‌చ్చిన వారికి 36వ ఏట బాగుంటుంది. ఆ వ‌య‌స్సులో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. రాహువు ప్ర‌భావం వ‌ల్ల వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారు.

Do You Know The Person When He Gets Luck-

5. డెస్టినీ నంబ‌ర్ 6 వ‌చ్చిన వారికి 25, 27, 32వ ఏట బాగుంటుంది. అప్పుడు వారు అనుకున్న‌ది సాధిస్తారు. అన్నీ శుభ ఫ‌లితాలే క‌లుగుతాయి.

6. డెస్టినీ నంబ‌ర్ 7 వ‌చ్చిన వారికి 20, 30, 38, 44వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారు విజ‌యావ‌కాశాల‌ను చ‌వి చూస్తారు. విజ‌యం సిద్దిస్తుంది.

7. డెస్టినీ నంబ‌ర్ 8 వ‌చ్చిన వారికి 36, 42వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. శ‌ని ప్ర‌భావం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.

8. డెస్టినీ నంబ‌ర్ 9 వ‌స్తే వారికి 28వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌చ్చి బాగుంటారు. కుజుని ప్ర‌భావం వ‌ల్ల పేరు, ప్ర‌ఖ్యాతులు సాధిస్తారు. శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.