భార్యకు మల్లెపూలు కొనిస్తే… ఏం జరుగుతుందో తెలుసా..శాస్త్రాలు ఏం చెప్తున్నాయి..   Do You Know If You Bring Mallepulu( Jasmins) For Your Wife     2018-09-05   11:59:55  IST  Rajakumari K

ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు..ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి..నల్లపిల్లి ఎదురైతే కీడు..ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం..వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా..మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉంటారు.. ప్రతి రోజు భార్యకు మల్లెపూలు తీసుకెల్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా…దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి..

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు.నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు..అలాంటి ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే,ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది… ఆడవాళ్ళు ఎంత ఆనందంగా సంసారాన్ని సాగిస్తే… ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది.మనిషిని వేదించే సమస్యల్లో ఒకటి ఆర్దికసమస్యలు..

Do You Know If Bring Mallepulu( Jasmins) For Your Wife-

అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజు మూరడు మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిది.మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేక పోతే ఇలా తప్పకుండా చేయండి.ప్రతి రోజు ఆమె తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు.. ఇదే కాక పరిమ భరితమైన జాజి, విరజాజివి వంటివి కూడా ఇవ్వచ్చు.. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.