ఎడమ చేతికి బంగారు ఉంగరాన్ని ధరిస్తే… మంచిదా….కాదా   Do Not Wear Gold On Your Left Hand     2018-09-24   08:58:56  IST  Laxmi P

భారతీయులకు బంగారం అంటే చాలా మోజు. అందుకే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది బంగారాన్ని ధరించటం వారి స్టేటస్ సింబల్ గా భావిస్తూ ఉంటారు. అయితే బంగారు ఆభరణాలను ఎలా ధరించాలి. బంగారం ధరించటం వలన మన గ్రహ స్థితి మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇటువంటి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

బంగారు ఆభరణాలను ఎడమ చేతికి ధరిస్తే కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల జ్యోతిష్యుని సలహా మేరకు మాత్రమే ఎడమ చేతికి ధరించాలి.

పాదాలకు బంగారు ఆభరణాలను ధరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటె మాత్రం కుడి చేతి ఉంగరం వేలికి ఉంగరం పెట్టుకుంటే మంచిది. ఈ ఉంగరం కారణంగా గ్రహ స్థితులు మారి అనుకూలంగా మంచి జరుగుతుంది.

గర్భిణీ స్త్రీలు బంగారాన్ని ధరిస్తే కొన్ని సమస్యలు వస్తాయి.

బంగారు ఆభరణాలను ఎట్టి పరిస్థితిలో పోగొట్టకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యలకు చిహ్నం.

ఏది ఏమైనా బంగారాన్ని ధరించే ముందు పండితుల సలహా తీసుకుంటే మంచిది.