హీరోయిన్‌ చెస్ట్‌పై దర్శకుడి చేయి.. ఎందుకో తెలిస్తే అభినందిస్తారు!!   Director Places Hands On Heroine Dakota Johnson Private Parts     2018-09-05   08:32:03  IST  Sainath G

కొన్ని సార్లు మన కళ్లు మనను మోసం చేస్తాయి. అక్కడ జరిగింది ఒకటైతే, మన కళ్లు మనకు మరో విషయాన్ని చూపిస్తాయి. తాజాగా ఇదే సంఘటన హాలీవుడ్‌ హీరోయిన్‌ డకోటా జాక్సన్‌ విషయంలో జరిగింది. ఈమె చెస్ట్‌పై దర్శకుడు చేయి వేసినట్లుగా ఫొటోలు వచ్చాయి. దాంతో ఆ ఫొటోలు కాస్త వైరల్‌ అయ్యాయి. అయితే అసలు విషయం మాత్రం వేరు అంటూ ఆ తర్వాత తేలింది. ఎంతో మంది తప్పుగా అర్థం చేసుకునేలా చేసిన ఆ ఫొటోలు ఇంకా కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఆ ఫొటోల వివరణ తెలిసిన తర్వాత దర్శకుడిని అభినందించకుండా ఉండలేక పోతున్నారు.

అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. హాలీవుడ్‌ నటి డకోటా జాక్సన్‌ తాజాగా తాను నటించిన చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వెన్నిస్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై సందడి చేయడం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి రెడ్‌ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజ్‌ు ఇస్తున్న సమయంలో ఈమె డ్రస్‌ జారి చెస్ట్‌ కనిపించింది. ఆ విషయాన్ని గమనించిన దర్శకుడు ఆమె చెస్ట్‌కు చేయి అడ్డం పెట్టాడు. అయితే ఆ సమయంలో చెస్ట్‌కు అతడి చేయి తాకలేదని తెలుస్తోంది. దర్శకుడు చేయి అడ్డం పెట్టిన వెంటనే హీరోయిన్‌ గమనించి తన డ్రస్‌ను సరి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Director Places Hands On Heroine Dakota Johnson Private Parts-

కెమెరాకు చిక్కిన ఫొటోల్లో మాత్రం దర్శకుడు హీరోయిన్‌ చెస్ట్‌పై చేయి వేసినట్లుగా, ఆ సమయంలో ఆమె సిగ్గు పడ్డట్లుగా అనిపిస్తుంది. కొన్ని సెకన్ల వ్యవధిలో తీసిన ఫొటోలు అవ్వడం వల్ల అసలు విషయం కాకుండా, మరోటి ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఈ విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతుంది. ఈ సమయంలో హీరోయిన్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. డైరెక్టర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు, ఆయన నా పరువును కాపాడాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ వివరణతో పాటు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు కూడా జనాలు పట్టించుకోకుండా ఇంకా ఆ ఫొటోపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.