మారుతి మంచి నిర్ణయం.. ఆ తప్పు పని ఇకపై అలా చేయను   Director Maruthi Care About Upcoming Movies     2018-09-09   12:55:38  IST  Sainath G

‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి ప్రస్తుతం స్టార్‌ హీరో దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చిన్న చిత్రాలతో పెద్ద విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి మరో వైపు నిర్మాణంలో కూడా తనదైన ముద్ర వేసి చిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి సినిమా అంటూ బూతు సినిమా అన్నట్లుగా పేరు పడిపోయింది. మారుతి నిర్మాణంలో లేదా సమర్పణలో వస్తుంది అంటే అదో పెద్ద బోల్డ్‌ సినిమా అయ్యి ఉంటుందని గతంలో అనుకున్నారు. ఆ ముద్రను చెడిపేసుకున్న మారుతి ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించాడు, కొన్ని సినిమాలను సమర్పించాడు.

ఈమద్య కాలంలో మారుతి నిర్మాణంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. వరుసగా మారుతి ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న కారణంగా ఆయనపై విమర్శలు వ్యక్తం అయ్యియి. ఏమాత్రం బాగా లేని సినిమాలను డబ్బు తీసుకుని సమర్పకుడిగా వ్యవహరించేందుకు వస్తున్న మారుతి తీరు మార్చుకోవాల్సిందిగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలే ‘బ్రాండ్‌ బాబు’ అనే చిత్రంను తాను నిర్మిస్తున్నట్లుగా మారుతి కలరింగ్‌ ఇచ్చాడు.

Director Maruthi Care About Upcoming Movies-

ఆ సినిమాకు మారుతి పేరు వాడినందుకు భారీగానే ముట్టజెప్పారు. డబ్బు అయితే దక్కింది. కాని ఆ సినిమా అట్టర్‌ ప్లాప్‌ అవ్వడంతో మారుతి బ్రాండ్‌ వ్యాల్యూ పడిపోయింది. అందుకే ఇకపై ఖచ్చితంగా సినిమాల నిర్మాణంకు కమిట్‌ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ మారుతి చెబుతున్నాడు. తన ఎక్కువ శ్రద్ద దర్శకత్వంపై ఉంటుందని, మంచి కథలు వచ్చినప్పుడు మాత్రం నిర్మాణంకు మొగ్గు చూపుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

డబ్బు కోసం పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చిన మారుతి మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మారుతి దృష్టి పెడితే మంచి సినిమాలు వస్తాయని, వరుగా కాకుండా సంవత్సరంలో ఒకటి రెండు చిత్రాలను మాత్రమే మారుతి నిర్మించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మారుతి తాజాగా తెరకెక్కించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 13 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.