ఎన్టీఆర్‌.. విషయంలో క్రిష్‌ సగం సక్సెస్‌     2018-08-15   12:15:14  IST  Ramesh Palla

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు క్రిష్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా రిలీజ్‌ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ ఏమేరకు మెప్పిస్తాడు, ఎంత వరకు ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య జీవిస్తాడు అంటూ అంతా కూడా ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. కాని తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ను చూసి ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు స్టన్‌ అవుతున్నారు. నిజంగా ఎన్టీఆర్‌ను దర్శకుడు క్రిష్‌ దించేశాడు అంటూ ప్రశంసల జల్లు కురుస్తుంది.

Director Krish Succeed About Selection Of NTR Biopic-

Director Krish Succeed About Selection Of NTR Biopic

ఎన్టీఆర్‌ మూవీ విషయంలో దర్శకుడు ఎవరు అంటూ చర్చ జరిగిన సమయంలో పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తేజను ఎంపిక చేసి షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే దర్శకుడు తేజ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నాడు. ఆ సమయంలో క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్‌ అయ్యాడు. క్రిష్‌పై ఉన్న నమ్మకంతో బాలకృష్ణ భారీ పారితోషికంను ఆఫర్‌ చేసి మరీ ఈ చిత్రానికి ఆయన్ను ఒప్పించాడు. ఒక వైపు బాలీవుడ్‌లో సినిమాను చేస్తున్న క్రిష్‌ ఈ చిత్రంను చేసేందుకు బాలకృష్ణ కోసం ఓకే చెప్పాడు.

క్రిష్‌ చేయి వేస్తే తప్పకుండా అది అద్బుతంగా మారుతుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే బాలకృష్ణ లుక్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్‌ చిత్రంలో బాలకృష్ణ అచ్చు ఎన్టీఆర్‌లా ఉండేలా మేకప్‌ వేయించడం అంటే మామూలు విషయం కాదు. కొందరు నిజంగా ఎన్టీఆర్‌ అనుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో క్రిష్‌ విజయం సాధించాడో చెప్పుకోవచ్చు. అన్ని గెటప్స్‌ కూడా తప్పకుండా ఇలాగే సేమ్‌ టు సేమ్‌ ఉంటాయని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Director Krish Succeed About Selection Of NTR Biopic-

గెటప్స్‌ విషయంలో సూపర్‌ అనిపించుకోవడంతో క్రిష్‌ సినిమా పరంగా అప్పుడే సగం సక్సెస్‌ను దక్కించుకున్నట్లే అంటూ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నారు.