వయస్సును బట్టి చర్మ సంరక్షణకు ఉపయోగించే పేస్ పాక్స్  

సాధారణంగా చర్మ తత్త్వం అనేది వయస్సును బట్టు మారుతూ ఉంటుంది. ఒక్కో వయస్సులో ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వయస్సుకు తగ్గట్టుగా చర్మ సంరక్షణకు ఉపయోగించే పేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

18-20 ఏళ్ళు వయస్సు వారు
వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి 10 నిమిషాల పాటు ఆలా ఉంచాలి. ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ తీసేసి, ఆ మిశ్రమం చల్లారిన తర్వాత కాటన్ సాయంతో ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ వయస్సులో వచ్చే మొటిమలు తగ్గిపోతాయి.

Different Ages Face Packs-

Different Ages Face Packs

20-25 ఏళ్ళు వయస్సు వారు
ఒక బౌల్ లో ఒక నిమ్మకాయను రసం పిండాలి. దీనిలో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ వయస్సులో వచ్చే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

25-30 ఏళ్ళు వయస్సు వారు
ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Different Ages Face Packs-

30 ఏళ్ల వయస్సు వారు
ఒక కప్పు బ్లూ బెర్రీలలో రెండు స్పూన్ల తేనే,ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

40 ఏళ్ల వయస్సు వారు
4-5 బాదంలను పేస్ట్ చేయాలి. కలబంద కట్ చేసి, అందలోని జెల్ తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి ముఖం, మెడకు అప్లై చేయాలి. 30 నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.