బిగ్ బాస్ హౌస్ నుండి దీప్తి సునైనా ఔటా.? అసలేమైంది? అలా అనడానికి కారణం ఏంటి?     2018-08-18   10:53:32  IST  Sai Mallula

నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 68వ ఎపిసోడ్‌కు చేరువకావడంతో కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. టైటిల్ రేస్‌లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్‌ 2తో హీరోగా మారిన కౌశల్‌ ఏకాకిగానే ఫైట్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ రేస్‌లో అందరికంటే ముందు ఉండటంతో అతడిపై మిగిలిన కంటెస్టెంట్స్ మూకుమ్మడి మాటల దాడికి సిద్ధం అయ్యారు.

Deepthi Sunaina Eliminated From Bigg Boss House-

Deepthi Sunaina Eliminated From Bigg Boss House

తాజగా బిగ్ బాస్ హౌస్ లో టెలిఫోన్ టాస్క్ మొదలైన సంగతి తెలిసిందే. టెలిఫోన్ టాస్క్ వలన హౌస్ లో కొత్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టెలిఫోన్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులని రెండు టీమ్స్ గా విభజించారు. కాల్ సెంటర్ ఉద్యోగుల టీం: కౌశల్, దీప్తి, సామ్రాట్, నూతన్, అమిత్, శ్యామల.. పబ్లిక్ టీం : పూజ, తనీష్, రోల్ రైడ, సునైన, గీత, గణేష్. ఈ టాస్క్ కాన్సెప్ట్ ఏంటంటే.. పబ్లిక్ కాలర్స్ కాల్ సెంటర్ ఉద్యోగులకు కాల్ చేసి వాళ్లను విసిగించి ఫోన్ పెట్టేసేలా చేయడం.. కాని ఈ టాస్క్‌ను పర్సనల్ ఎటాక్‌గా మార్చేశారు దీప్తి సునయన, గీతా మాధురి, గణేష్‌లు.

దీప్తి సునయన వల్గర్ లాంగ్వేజ్‌తో కౌశల్‌పై మాటల యుద్ధానికి తెరతీసింది. అసలు ఏంటి నీ బాధ. బిగ్ బాస్ హౌస్‌లో ఏం చేయాలనుకుంటున్నావ్.. జనాలు నిన్ను ఎలా చూస్తున్నారో ఏమో కాని.. అసలు నీకు ఓట్లు ఎలా వస్తున్నాయో అర్ధం కావడం లేదు. నీ నటన గురించి వాళ్లకు తెలియక పోవడం వల్ల నువ్ తెగ ఫీల్ అయిపోతున్నావ్. నిజం చెప్పాలంటే నీకసలు బిగ్ బాస్ హౌస్‌లో ఉండే అర్హతే లేదు. బిగ్ బాస్ హౌస్‌లో నీ ప్రవర్తను ఎలా ఉందో 24 గంటలు జనం చూస్తే.. నీ ముఖం మీద తూ… అని ఊస్తారు. నువ్ పెద్ద హీరోలా ఫీల్ అయిపోకు. నీకు తెలియడం లేదేమో నువ్ హీరోవి కాదు జోకర్‌వి అవుతున్నావ్ అంటూ నోటికొచ్చినట్టు మాటల దాడి చేసింది. అయితే కౌశల్ సహనం కోల్పోకుండా ఆమె మాటల్ని తప్పికొట్టి పాయింట్ గెల్చుకున్నాడు.

Deepthi Sunaina Eliminated From Bigg Boss House-

ఇక దీన్ని బట్టి చూస్తే ఆడియన్స్ ఈ సారి దీప్తి సునైనాను టార్గెట్ చేస్తారని అర్ధం అయిపొయింది. ప్రస్తుతం నామినేషన్లో దీప్తి సునైనా, గీత మాధురి, నూతన నాయుడు, పూజ, రోల్ రైడా మరియు శ్యామల ఉన్నారు.. అయితే ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం ఎక్కువవుతుంది.. సునైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనడానికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. సునైనా బిగ్ బాస్ ఇంట్లో ఓ చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది తప్ప, స్వంతంగా గేమ్ ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవట్లేదు.. అలాగే రీసెంట్‌గా జరిగిన కాల్ సెంటర్ టాస్క్‌లో కౌశల్‌కి కాల్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటంతో సునైనా మీద ప్రేక్షకులకు నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.. దీంతో ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.