దీప్తి కి పడేవి అన్ని ఫేక్ ఓట్లేనా.? కౌశల్ కి ఓట్లు తగ్గడానికి అసలు కారణం ఇదేనా.?   Deepthi Nallamothu First Place In Voting Bigg Boss 2 Telugu Show     2018-09-26   09:52:08  IST  Sainath G

ఇంకొంచెం మసాలా అంటూ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. 7 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం అయిదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి అటు కంటెస్టెంట్స్ లోనే కాదు ఇటు ఆడియన్స్ లో కూడా నెలకొంది. కౌశల్ ఆర్మీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు టైటిల్ కౌశల్ దే అని. అలాగని మిగిలిన కంటెస్టెంట్స్ దీప్తి, గీత మాధురి, సామ్రాట్, తనీష్ ని తక్కువ అంచనా వేయలేము. చివరి క్షణంలో ఏమైనా జరగొచ్చు. మొదటి సీజన్లో లో కూడా చివరి వరకు నవదీప్ కు మంచి సపోర్ట్ ఉంది కానీ టైటిల్ గెలవలేకపోయారు.

ఇది ఇలా ఉండగా..ఈ వారం ఓటింగ్ ఆదివారం మొదలు కాగా, దీప్తి రాకెట్ స్పీడ్ తో ఓటింగ్ లో దూసుకెళ్తోంది. ఈమెకు అత్యధిక ఓట్లు నమోదవుతున్నట్లు ట్రెండ్ చెబుతోంది. భారీ ఓటింగ్ తో బాగా అగ్రస్థానంలో దీప్తి దూసుకుపోతుంటే ఆతర్వాత కౌశల్,గీతా మాధురి,తనీష్ , సామ్రాట్ ఉన్నారంటే అందరికీ ఆసక్తి కల్గిస్తోంది. ఇక గ్రాండ్ ఫినాలేకి చేరిన సామ్రాట్ ఓట్ల పరంగా చిట్టచివరి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకూ ఓట్ల పరంగా ముందంజలో ఉంటూ వచ్చిన కౌశల్ ఈ వారం ఎందుకో ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు.

ఆడియన్స్ వోటింగ్ కి దూరంగా ఉంటున్నారేమో అని డౌట్ వస్తుంది. కౌశల్ గెలుపు గురించి కౌశల్ ఆర్మీ చూసుకుంటుందిలే అని చాలామంది ఓట్ చేయడం లేదు. ఈసారి కి తాము ఓటువేయకపోతే ఇంకొకళ్ళు వేస్తారులే అనే ధోరణి కనిపిస్తోందని క్రిటిక్స్ అంటున్నారు. దీనివల్లనే కౌశల్ కి ఓట్లు తగ్గిపోయాయని విమర్శలు వస్తున్నాయి. ఇదే కొనసాగితే గ్రాండ్ ఫినాలేలో నిరాశ తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే దిప్తీది ఫేక్ ఒటింగ్ అని కౌశ‌ల్ ఆర్మి విమ‌ర్షిస్తొంది. మ‌రి ఈ విమ‌ర్ష‌ల‌కు పుల్ స్టాప్ ప‌డి ఫైన‌ల్ లొ విజేతగా నిలిచేదెవ‌రో తెలియాలంటే మ‌రికొంత స‌మ‌యం ఆగాల్సిందే.