కో 'దండయాత్ర' ... మహాకూటమికి డెడ్ లైన్   Dedline To Mahakootami On The TJS Seats     2018-10-09   16:48:55  IST  Sai M

మహా కూటమిలో సీట్ల లొల్లి ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. తాము కోరినన్ని సీట్లు ఇస్తేకాని కూటమిలో ఉండబోమని అందులోని పార్టీలు తెగేసి చెప్పేస్తున్నాయి. సీట్లపై ఎటూ తేల్చని మహాకూటమికి టీజేఎస్ డెడ్‌లైన్‌ విధించింది. రెండ్రోజుల్లోగా తాము కోరిన సీట్లను ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. డెడ్‌లైన్ దాటితే మొదటి విడత 21 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ప్రకటిస్తామని.. వారం రోజుల తర్వాత మరో 30 మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తామని టీజేఎస్ స్పష్టం చేసింది. తమతో కలిసి వచ్చే పక్షంతో ఎన్నికలకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నామని కోదండరాం హెచ్చరించారు.